పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చనిపోయి మోక్షాన్ని చేరేవరకూ అతడు మనకు సేవలు చేస్తూనే వుంటాడు. ఈలాంటి మహోపకారిపట్ల మనం కృతజ్ఞలమై వుండాలి. రోజుపొడుగున చాలసార్లు మన కావలి సన్మనస్కని ప్రేమభావంతో గుర్తుకి తెచ్చుకోవాలి. వివయంతో అతనికి నమస్కారం చేయాలి. అక్టోబరు రెండు అతని పండుగ. ఆ రోజున, ఆ నెలో అతని పట్ల విశేష భక్తిని చూపాలి. అవకాశం కలిగినప్పడు తోడి వారినిగూడ కావలి సన్మనస్కుపట్ల భక్తిని పెంపొందించు కొండని హెచ్చరించాలి. బైబుల్లో సన్మనస్కులను గూర్చిన వాక్యాలనూ, ఘట్టాలనూ జాగ్రత్తగా చదువుకొని మననం జేసికోవాలి. మన సన్మనస్కు మనకు కలిగించే ప్రబోధాలనూ, ప్రేరణలనూ జాగ్రత్తగా గమనిస్తూండాలి. అతని హెచ్చరికను పెడచెవిని పెట్టినపుడు శీఘమే అతనికి క్షమాపణం చెప్పకోవాలి. అతని పేరు మీదిగా, అతనికి సంతోషం కలిగేలా పలుసార్లు ఏవైనా చిన్న పుణ్యకార్యాలు చేస్తుండాలి. సంగ్రహంగా చెప్పాలంటే, మన జీవితంలో "కావలి సన్మనస్కుల సంస్కృతిని" అలవర్చుకోవాలి.

కావలి సన్మనస్కునికి ప్రార్ధనం

పవీత్రడవైన కావలి సన్మనస్మూ! నీవు నాకు ఉత్తమ స్నేహితుడివి, మంచి మార్గదర్శివి. నేను పట్టినప్పటినుండి ఇప్పటివరకు నీవు నాకు చేసిన నానా ఉపకారాలకు నీకు హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. రేయింబవళ్ళు నీవు నాకు కాపలా కాస్తున్నావు. అనేక అపాయాలనుండి నన్ను కాపాడావు. ఎల్లవేళల నన్ను సంరక్షిస్తూ వచ్చావు. అనేక పర్యాయాలు చెడ్డనుగూర్చి నన్ను హెచ్చరించావు. పాపం నుండి నన్ను కాపాడావు. నేను దేవునికి ద్రోహంగా పాపం చేసినపుడు నా అంతరాత్మను ప్రబోధించి నాకు పశ్చాత్తాపం పట్టించావు. నేను పాపంలో చనిపోయి నరకంలోనికి పోలేదంటే దేవుని తర్వాత నీవే ముఖ్యకారణం.

మిక్కిలి ప్రియుడవైన కావలి సన్మనస్కూ! నేను నీ దయకు, మంచితనానికీ ఏలా కృతజ్ఞత తెల్చుకోగలను? నాకున్నవి దేహాత్మలు రెండే ఈ రెండిటినీ నీ అధీనంలో వుంచుతున్నాను. నేను నిరంతరం నీ సన్నిధిలో మెలుగుతూ నీ ప్రేరణలకు లొంగుతానని మాటయిస్తున్నాను. ఓ పవిత్ర సన్మనస్కూ! నీ తరపున నీవు సకలాపదలనుండి నన్ను కాపాడుతూండు. నేను విచారంగా వున్నపుడు నాకు ఆనందాన్ని దయచేయి. హింసలకు చిక్కినపుడు నన్ను సంరక్షించు. అపాయాల్లో నన్ను కాపాడు. నా అక్కరల్లో నాకు సహాయం చేయి. నేను అజ్ఞానినిగా వున్నపుడు నాకు బోధచేయి. సందేహాల్లో నాకు సలహానివ్వ రోజువారి పనుల్లో నాకు సూచనలివ్వ విశేషంగా పిశాచతంత్రాలనుండి నన్ను కాపాడు. నీ సహాయం వలన నేను అన్ని పనులు దేవుని కీర్తికొరకే చేసి కడన మోక్షభాగ్యాన్ని పొందుదునుగాక. ఆమెన్.