పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశ్చర్యపోయి "అయ్యా! నీవు ప్రవక్తలాగున్నావు" అంది - యోహా 4,18. ఈలా రహస్యాలను తెలిసికొనే శక్తి ప్రవక్తతలకు అబ్బుతుంది.

6. దర్శనాలు

ప్రవక్తలు దర్శనాలు చూడ్డం కద్దు. ఆ దర్శనాల్లో ప్రభువు వాళ్లకు ఏదో సందేశం విన్పిస్తాడు. తరువాత ప్రవక్తలు ఆ సందేశాన్ని ప్రజల కెరిగిస్తారు. పూర్వవేదంలో యెహెజ్కేలు దానియేలు ఈలాంటి దర్శనాలను చాల ఉదహరించారు. నూత్న వేదంలో చివరిదైన దర్శన గ్రంథం కూడ వీటిని వర్ణిస్తుంది. ఉదాహరణకు యెహెజ్కేలు ప్రవచనం ఈలా ప్రారంభమౌతుంది. “ఇరువదియవయేటి నాల్గవ నెలలోని ఐదవ రోజున నేను తోడి యూదులతో గలసి బాబిలోనియా లోని కేబారు నది తీరాన ప్రవాసంలో వుండగా ఆకాశం తెరువబడింది. నేను దేవుణ్ణి దర్శించాను” - 1,1.

ఓమారు మోషే చెల్లెలు మిర్యాము అతని అన్న అహరోను అతని మీద తిరగబడ్డారు. అప్పడు ప్రభువు మోషే కోపు తీసికొని ఆ యన్నా చెల్లెళ్ళను చీవాట్లు పెట్టాడు, "మీలో ఎవరైనా ప్రవక్తలుంటే నేను వాళ్లకు దర్శనాల్లో కనిపిస్తాను. కలల్లో వాళ్లతో మాట్లాడతాను. కాని నా భక్తుడైన మోషేతో మాత్రం నేరుగానే మాట్లాడతాను. అలాంటి వాణ్ణి ఎదిరించడానికి మీకు ఎన్ని గుండెలు?" అని ఉగ్రుడై పోయాడు - సంఖ్యా 12,6-8. ఈ సందర్భాన్ని బట్టి గూడ ప్రభువు దర్శనాల ద్వారా ప్రవక్తలతో మాట్లాడతాడని భావించుకోవాలి.

7. నటన చేసి చూపించడం

ప్రవక్తలు కొన్నిసార్లు దైవ సందేశాన్ని నటన చేసి చూపించారు. యిర్మీయా యెద్దల కాడిని మెడ విూద పెట్టుకొని తిరిగాడు. యిప్రాయేలు రాజ్యం బాబిలోను రాజుల అధికారం లోకి వస్తుందనీ, ఆ రాజులు యూదుల విూద తమ కాడిని మోపుతారనీ దీని భావం - యిర్మీ 21,1-2 మరో మారు ఈ ప్రవక్త తాను తొడుగుకొనే నిక్కరుని నేలలో పాతిపెట్టాడు. అది చివికి చెడిపోయింది. ప్రభువు యిస్రాయేలును కూడ ఈ నిక్కరుని లాగే నాశం చేస్తాడని దీని భావం - 13,1-11. ఇంకోమారు ఇతడు హిన్నోములోయకు వెళ్ళి అక్కడ ఓ మట్టికుండను పగులకొట్టాడు. ఆ కుండ పగిలి పోయినట్లుగనే ప్రభువు యిస్రాయేలును నాశం చేస్తాడని చెప్పాడు - 19,10-11. వేరొకమారు అతడు స్వీయనగరమైన అనతొతులో ఓ పొలాన్ని కొన్నాడు. ఇది యిప్రాయేలీయులు బాబిలోను • ప్రవాసం నుండి తిరిగివచ్చి మళ్ళా తాము కోల్పోయిన పొలాలను కొని స్వాధీనం చేసికోవడానికి చిహ్నం - 32, 1-15.