పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశువు చుట్టూ ప్రోగై "మహోన్నతంలో సర్వేశ్వరునికి మహిమ. భూలోకంలో ఆయన అనుగ్రహానికి నోచుకొన్నవారికి సమాధానం" అని పాడారు - లూకా 2,13-14 వాళ్ళు దేవుని నరావతార రహస్యాన్ని జకరియాకు, మరియా యోసేపలకు, పొలాల్లో గొర్రెలు కాచుకొనే కాపరులకు తెలియజేసారు. క్రీస్తు రాకముందు వాళ్ళ దేవునికీ నరులకూ నడుమ మధ్యవర్తులు. క్రీస్తు వచ్చాక అతడే ప్రధాన మధ్యవర్తి, కనుక క్రీస్తు జననం తర్వాత దూతలు మనకు సహాయకులుగా మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళు పూర్వం తమంతట తాము ప్రజలను దేవుని దగ్గరికి రాబట్టలేకపోయారు, ఇప్పుడు క్రీస్తు సహాయంతో ఆ పని చేస్తారు. కనుక క్రీస్తు శిశువు చుటూ ఆనందంతో గుమిగూడారు.

4. క్రీస్తు ఉత్థాన మోక్షారోహణాల్లో సన్మనస్కులు క్రీస్తు జనన కాలంలోను, ఉత్థాన కాలంలోను అతనితో ఎక్కువగా వుంటారు. ప్రభువు మోక్షారోహణమౌతుండగా దేవదూతలు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు - అ,చ. 1,10. మనుష్యావతారంలో దేవుడు సన్మనస్కులకంటె తక్కువవా డయ్యాడు. కాని ఉత్దానానంతరం వారికంటె ఎక్కువ వాడయ్యాడు. సన్మనస్కులు మానుష్య దేహంతో స్వర్గాన్ని చేరుకొన్న క్రీస్తుని ఆరాధించాలి. అతని ద్వారా మన మానవత్వం సన్మనస్కుల స్వభావం కంటె ఉన్నతమైంది ఐంది. కనుక దూతలు ఉత్థాన క్రీస్తుని చూచి విస్తుపోయి అతనికి ప్రణమిల్లారు. పౌలు భక్తుడు చెప్పినట్లుగా, అతడు సన్మనస్కుల వర్గంలోని ప్రభువులకు, అధికారులకు, శక్తులకు నాథులకు అధికుడయ్యాడు - ఎఫే 1,21. కనుక సన్మనస్కులు అతన్ని ఆరాధించి స్తుతించారు.

5. సంస్కారాల్లో సన్మనస్కులు మన కంటికి కన్పించకుండానే మన ఆరాధనలో పాల్గొంటారు. మన వేదపఠనాలు, ప్రసంగాలు వాళ్ళూ వింటూంటారు. మనలను జ్ఞాన స్నాన స్వీకరణకు సిద్ధం జేస్తారు. ఈ సంస్కారం ద్వారా మనం దైవ ప్రజలమైనందుకు సంతోషిస్తారు. దివ్యసత్రసాద బలిలో కూడ వాళ్ళ ప్రత్యక్షమై వుంటారు. పరలోకంలో నిరంతరం దైవారాధనం జరుగుతూంటుంది. దూతలు స్వర్గంలో ఎల్లవేళల దేవుణ్ణిస్తుతించి కీర్తిస్తుంటారు. దీని ప్రతిబింబమే భూలోకంలో మనం సమర్పించే దివ్యసత్రసాద బలి. కనుక మన పూజలో దూతలు కూడ పాల్గొని దివ్యసత్రసాద ప్రభువుని ఆరాధిస్తారు - హెబ్రే 12, 22-24. ఆరాధనలో దేవదూతలు గూడ పాల్గొంటారు గనుక స్త్రీలు మర్యాదగా తలమీద ముసుగు వేసికోవాలని పౌలు కొరింతు క్రైస్తవులను ఆజ్ఞాపించాడు -1కొ11,10.

6. ఆధ్యాత్మిక జీవితంలో సన్మనస్కులు మన ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పడతారు. ఇది మూడు విధాలుగా మొదటిది, అపవిత్రమైన ప్రాణియేది భగవంతుణ్ణి సమీపించలేదు. కనుక వాళ్ళ మన ఆత్మలను శుద్ధిచేస్తారు. పూర్వం దేవదూత యెషయా ప్రవక్త పెదవులను శుద్ధిచేసాడని చదువుతున్నాం - యెష6,7. అలాగే ఇప్పుడు మన ఆత్మలను నిర్మలం చేస్తారు.