పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు భక్తులైన చిన్నవారి దూతలు పరలోకంలో దేవుని ముఖాన్ని వీక్షిస్తూ ఆ చిన్నవారిని కాపాడుతుంటారు - మత్త 18,10. పేత్రుని చెరసాలనుండి వెలుపలికితీసికొని వచ్చింది సన్మనస్కే - అ,చ, 12, 11. దైవప్రజల ప్రార్థనలను దేవునికి అర్పించే దూత ఒకడున్నాడు - దర్శ 8,3. యెరూషలేములో యూద నాయకులు అపోస్తలులను చెరలో బంధింపగా సన్మనస్కు వారిని అద్భుతంగా విడిపించాడు- అ,చ, 5,19. ఒకతని ఫిలిప్పచే ఇతియోపియా ఉద్యోగికి జ్ఞానస్నానం ఇప్పించాడు - అ.చ. 8,26. మరో అతని అన్యజాతివాడైన కొర్నేలికి పేత్రుతో పరిచయం కలిగించాడు -10,3. ఇంకో అతని తుఫానులో చిక్కుకొన్న పౌలుకి ధైర్యం చెప్పి దైవ సందేశాన్ని విన్పించాడు-27, 23-24

దైవభక్తులను హింసించే హెరోదుని ఒక దూత హతమార్చాడు - అ.చ. 12,23. రెండవ రాకడలో దేవదూతలు కూడ ప్రభువుతో వేంచేస్తారు - మార్కు 8, 13. క్రీస్తు మహిమలో వారికీ భాగం లభిస్తుంది. లోకాంతంలో న్యాయతీర్పు జరిగేప్పడు భక్తులను దేవుని యెదుట ప్రోగుజేసేది దూతలే - లూకా 9, 26. అప్పడు దుష్టులను నీతిమంతుల నుండి వేరుచేసేది వాళ్ళే - మత్త 13, 49. పుణ్యాత్ములు దేవదూతలతో కలసి మోక్ష ప్రవేశం చేస్తారు - హెబై 12,22. మనం దేవుణ్ణికాని దేవదూతలను ఆరాధించకూడదు - కొలో 2, 18, దర్మ 19, 10. చివరి పుస్తకమైన దర్శనగ్రంథం చాల పర్యాయాలు దేవదూతలను పేర్కొంటుంది. పాళ్ళ దేవుని కార్యాలను నిర్వహిస్తూ దైవభక్తులకు సహాయం చేస్తుంటారు.

2. వేదశాస్త్రుల భావాలు

పైన పేర్కొన్న బైబులు భావాలను మనసులో పెట్టుకొని వేదశాస్తులు సన్మనస్కులను గూర్చి కొన్ని అంశాలు చెప్పారు. ఇక్కడ రెండింటిని మాత్రం పేర్కొందాం.

1. సన్మనస్కుల నైతిక వర్తనం

సన్మనస్కులు కేవలం ఆత్మస్వరూపులు. మన శరీరాలు వాళ్ళకుండవు. అసలు మన భౌతిక పదార్ధమేమీ వాళ్ళల్లో వుండదు. వాళ్ళ నరులకు కన్పించినపుడు శరీరధారుల్లాగ కన్పిస్తారు, అంతే

దేవుడు మొదట సృజించిన సృష్టి ప్రాణులు దేవదూతలు, వారికి తెలివితేటలు, పరిపూర్ణ స్వేచ్చ వున్నాయి. కనుక వాళ్ళ పాపం చేయగలిగిన స్థితిలో వున్నారు. పాపం చేసారు కూడ. వాళ్ళ పాపమేమిటో ఎవరికీ రూఢిగా తెలియదు. చాలమంది వేదశాస్తుల అభిప్రాయం ప్రకారం వాళ్ళ పాపం గర్వం. దేవుడు వారిని నరుడై జన్మించే సుతుణ్ణి