పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.యాకోబు నిచ్చెన - ఆది 10-1

4.యాకోబు దేవదూతతో కుస్తీ పట్టడం - ఆది 32, 24-29

5.దేవదూత మనోవా దంపతులకు దర్శనమీయడం - న్యాయా 13, 1-20

6.యేలీయాకు భోజనం పెట్టడం – 1 రాజు 19, 5-8

7.తోబీత కథ

నూత్న వేదంలో సన్మనస్కుల దర్శనాలు చాల వున్నాయి, వీళ్ళ అయా వ్యక్తులకు నరరూపంలో కనిపించారు అనుకోవాలి. గబ్రియేలు దూత జకరియాకు మరియకు కనిపించాడు. దేవదూతలు కాపరులకు కన్పించి క్రీస్తు జననాన్ని ఎరిగించారు — లూకా 19. ఆలాగే పుణ్యస్త్రీలకు సమాధి వద్ద కన్పించారు - మత్త28, 7-5, పేత్రుకి కూడ చెరలో కన్పించారు - అచ 12,7. వీరిలో కొందరు ప్రకాశంతోను కొందరు తెల్లని వెలుగుగాను దర్శనమిచ్చారు. దర్శన గ్రంథంలో చాలమంది చాలసార్లు దర్శనమిచ్చారు.

3. దేవదూతల సేవలు

దేవదూతల ప్రధాన కార్యం దేవుణ్ణిస్తుతించి ఆరాధించడం. రఫాయేలు "నేను దేవుని దివ్యసన్నిధిలో నిల్చి అతనికి సేవలు చేసే ఏడురు దేవదూతల్లో వొకట్టి" అని చెప్పాడు - తోబీతు 12,15, కీర్తన 103, 20-21

"బలాఢ్యులైన ప్రభువు దూతలారా!

అతని ఆజ్ఞ పాటించి అతనిమాట వినువారలారా!

మీరు అతనిని స్తుతింపుడు

ప్రభువు సైన్యములారా!

అతనికి పరిచారకులై అతని చిత్తమును పాటించు వారలారా!

మీరు అతనిని స్తుతింపుడు"

అంటుంది. ఈ వాక్యాలను బట్టి దేవుని చిత్తానికి లొంగి అతన్ని పూజిస్తుండడం దూతల ముఖ్యకార్యం అనుకోవాలి. ఇంకా వాళ్ళు దేవుని కొలువులో పాల్గొని అతనికీ తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు -1 రాజు 22, 19–22. మనం చేసే మంచి చెడ్డలను గ్రంథంలో వ్రాసి వంచుకొని న్యాయనిర్ణయ దినాన దాన్ని విప్పతారు — దానియేలు 7.10. వాళ్ళ దేవుని కోరికపై భూలోకంలోని నరులకు సహాయం చేస్తుంటారు. ఈ సహాయం రకరకాలుగా వుంటుంది. ఒక దేవదూత దేవుని సందేశాన్ని యాకోబుకు తెలియజేసి అతన్నిలాబాను ఇంటినుండి స్వీయ దేశానికి తిరిగి రమ్మని చెప్పాడు - ఆది 31, 11. హిజ్కియా రాజు కాలంలో సనైరీబు అనే అస్పిరియా రాజు పాలస్తీనా దేశం