పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. సన్మనస్కులు

బైబులు భాష్యం - 152

విషయసూచిక

1.బైబుల్లో దేవదూతలు

2.వేదశాస్త్రులు భావాలు

3.దూతల గణాలు

4.కావలి సన్మనస్కులు

5.చిత్రాల్లో, బొమ్మల్లో సన్మనస్కులు

6.ఆధునికుల అవిశ్వాసం

7.సన్మనస్కుల పట్ల భక్తి

1. బైబుల్లో దేవదూతలు

సన్మనస్కుకి గ్రీకులో ఆంగెలోస్ అనీ, హీబ్రూలో మాలక్ అనీ పేర్ల దూత అని ఈ పేర్లకు అర్థం. దేవుడు వాళ్ళను నరుల దగ్గరికి దూతగా పంపుతాడని భావం. హీబ్రూ పూర్వవేదం వారిని వీరులు, సైనికులు, సేవకులు, కావలివాళ్ళ పవిత్రులు, దేవుని కుమారులు, దేవుళ్ళు అని కూడ పిలుస్తుంది.

బైబుల్లో దేవదూతలను గూర్చి స్పష్టమైన భావాలున్నాయి. కాని యిస్రాయేలు ప్రజలు మొదట కనానీయులనూ తర్వాత పారశీకులనూ జూచి ఈ భావాలను అభివృద్ధి చేసికొన్నారు. పూర్వవేదంలో దేవదూతలు దేవునికీ నరునికీ మధ్య మధ్యవర్తులుగా కన్పిస్తారు. నూత్నవేదంలో క్రీస్తే ప్రధానమైన మధ్యవర్తి, కనుక దూతల ప్రమేయం కొంత తగ్గింది. కాని పూర్వవేద ప్రజలకంటె నూత్నవేద ప్రజలకు దూతల స్వభావాన్ని గూర్చి ఎక్కువగా తెలుసు. మనం బైబుల్లో కన్పించే దేవదూతలను గూర్చిన భావాలను మూడంశాల క్రింద పరిశీలించి చూడవచ్చు.

1. దేవదూతల స్వభావం

పూర్వవేదం దేవదూతల స్వభావాన్ని గూర్చి కొన్ని విషయాలు చెప్థుంది. వాళ్ళు దైవలోకంలో, దేవుని కొలువులో వుంటారు. దేవునికి సలహాదారులుగా వుంటూరు - 1 రాజు 22, 19–22 మన కంటికి కనిపించరు, మనకు అందుబాటులో వుండరు. శరీరధారులు కారుకనుక మన ఆకలిదప్పలు వారికుండవు - తోబీతు 12, 19, అసలు