పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు మరణం మనకు రక్ష కనుక మనం మరణానికి భయపడకూడదు. అది మనకు నష్టంగాదు, లాభమే. అందుకే పౌలు మరణం నాకు లాభం, క్రీస్తు నాకు జీవం అని చెప్పకొన్నాడు – ఫిలి 1, 21. తాను భౌతిక శరీరాన్ని త్యజించి ప్రభువు సన్నిధిని చేరుకోవడం మేలని తలంచాడు - 2 కొరి 5,8. ఈ జీవితాన్ని త్యజించి క్రీస్తుని చేరుకోవాలని గాఢంగా వాంఛించాడు - ఫిలి 1, 23. ఈలా భక్తిమంతులు మరణానికి భయపడలేదు కదా, దాన్ని ఆహ్వానించారు. దానికొరకు ఉవ్విళ్ళూరారు. క్రీస్తుని అనుభవానికి తెచ్చుకొన్నవాళ్ళంతా ఈలాగే మరణాన్ని ఆహ్వానిస్తారు. ఆ ప్రభువుపట్ల అనుభవం లేనివాళ్ళ మాత్రం చావుకి భయపడతారు.

2. రెండవ ఆదాము

పడిపోయిన నరుణ్ణి లేవడానికి తండ్రి కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు దీననరరూపంతాల్చి పాపపు మానవుళ్ళాగ ఈ లోకంలోకి వచ్చాడు. సమకాలికులైన యూదులు స్వార్ధంవల్లా అజ్ఞానంవల్లా అతన్ని క్రూరమైన సిలువ మరణానికి గురి చేసారు. క్రీస్తు ప్రేమతో తండ్రి చిత్తానికి లొంగి సిలువ మరణాన్నిఅంగీకరించాడు. మామూలుగా చావులో అవిధేయతా, తిరుగుబాటూ వుంటాయి. కాని క్రీస్తు మరణంలో తండ్రిపట్ల విధేయతా ప్రేమా వున్నాయి. అతని మరణం పాపపరిహారబలి ఐంది. తండ్రిపట్ల లొంగుబాటు ఐంది. ఈలాంటి ప్రేమపూరితమైన మరణంద్వారా క్రీస్తు మానవ స్వభావం మహిమనూ దివ్యత్వాన్ని పొందింది. క్రీస్తు ఆత్మార్పణం తండ్రికి ప్రీతి కలిగించింది. కనుకనే తండ్రి అతన్ని ఉద్ధితుణ్ణి చేసాడు. అతన్ని పవిత్రాత్మతో నింపాడు. క్రీస్తుతో మరణ స్వరూపం పూర్తిగా మారిపోయింది. చావంటే దేవునికి ఎదురు తిరగడం. కాని విధేయతతో కూడిన క్రీస్తుతమరణం, తండ్రి నరులకొరకు ప్రేమతో ఏర్పాటుచేసిన రక్షణ ప్రణాళిక అయింది.

క్రీస్తు కేవలం ఓ ప్రత్యేక వ్యక్తిగా మన తరపున చనిపోలేదు. పాపపు నరుల దైవ శిక్షకు గురైయుండగా ఆ శిక్షను తొలగించడానికి మాత్రమే చనిపోలేదు. అతడు నరజాతితో ఐక్యమై వారి ప్రధాన యాజకుడుగా, వారి కొరకు చనిపోయాడు. తొలి ఆదాము మనకు శిరస్సు కనుకనే అతని పాపమూ చావూ మనకుకూడ ప్రాప్తించాయి. రెండవ ఆదామైన క్రీస్తుకూడ మానవ జాతికి శిరస్సు .కనుకనే ఇతని వత్థానమూ జీవమూ మనకుకూడ లభించాయి. ఆ యాదాము మనకు వినాశకుడైతే ఈ యాదాము ఉద్దారకుడు. క్రీస్తు తండ్రికి విధేయుడై మరణించాడు. కనుక తండ్రి అతన్ని చావునుండి లేపి, మహిమపరచి తన కుడి ప్రక్కన కూర్చుండ బెట్టుకొన్నాడు. ప్రభువు అనే తన బిరుదాన్ని కుమారునికిచ్చాడు. ఈ మహిమాన్వితుడైన క్రీస్తు నేడు మనలను రక్షించేవాడు. మనకు ఆత్మనిచ్చేవాడు. పాపపూరితమైన మన చావుని పవిత్రంచేసి మనకు పరలోక వారసత్వాన్ని