పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు మనకు ఆదర్శంగా వండాలనీ వాకొంది, ఏడవదినం యజమానుడూ అతని పనివాళ్ళూ పశువులూ కూడ విశ్రాంతిని పొందాలి. ఆ రోజు ప్రధానంగా ప్రభువుని పూజించే దినం -నిర్గ 20:9 -11.

మనం దేవునికి పోలికగా కలిగింపబడిన వాళ్ళం. ఆ దేవుడే ఆరురోజులు విశ్రాంతి తీసికొంటే, అతనికి పోలికగా వున్న మనకు కూడ విశ్రాంతి అవసరం, దేవుడు కృషి చేసేవాడే ఐనా అతడు ప్రధానంగా విశ్రాంతిని పొందేవాడు. కనుక మనకు కూడ విశ్రాంతి అవసరం. ఐతే విశ్రాంతి దినాన మనం ప్రధానంగా దేవుని దగ్గరికి రావాలి. అతన్ని పూజించాలి. బెతనీ మరియలాగ అతని పాదాల చెంత కూర్చుండి అతని బోధలు వినాలి - లూకా 10,39. ఈ లోకంలో మనం చేయగల ఉత్తమోత్తమమైన కార్యం దేవుణ్ణి పూజించడమే. దానివలననే మనకు పరలోకంలో దైవదర్శనం కలుగుతుంది. అసలు మన పని విలువయేమిటి? కడపటి దినాన "ఉత్తముడవ నమ్మదగిన వాడవనైన సేవకా! నీ యజమానుని ఆనందంలో నీవుకూడ పాలు పంచుకో" అనే వాక్యాన్ని ప్రభువు నుండి వినడమే మన పనికి సార్ధక్యం - మత్త 25,21. ఇంకో విషయం కూడ. పనికి శాశ్వతస్థితి లేదు. అది కేవలం ఈ లోకానికి పరిమితమైంది. మోక్షంలో పని వుండదు. అక్కడ విశ్రాంతి మాత్రమే వుంటుంది. భగవంతుడూ పునీతులూ అంతా అక్కడ విశ్రాంతిని పొందుతూంటారు - దర్శ 14,13. కనుక ఈ లోకంలో మనం ఎడతెగని పనితోనే సతమతమైపోకూడదు. తగినంత విశ్రాంతిని గూడ పొందుతూండాలి. ఇక్కడి విత్రాంతి మోక్ష విశ్రాంతికి సూచనంగా వుండాలి.

పనికీ పూజబలికీ గూడ సంబంధం వుంది. మిమ్మమీరు సజీవబలిగా దేవనికి సమర్పించుకోండి అన్నాడు పౌలు - రోమా 12,1. యెరూషలేము దేవాలయంలో జంతుబలులు సమర్పించారు. నేడు మనం పూజలో జంతుబలులను అర్పించం. మనలను మనమే క్రీస్తు ద్వారా తండ్రికి అర్పించుకొంటాం, ఇది దివ్యమైన పని. పూజలో అప్సరసాలను అర్పిస్తాం. ఈ వస్తువులు మనం తయారు చేసినవి. మన కృషికి నిదర్శనంగా వుండేవి. కనుక పూజలో “మన కృషిని దేవునికి అర్పిస్తున్నాం. మనలను మనం దేవునికి అర్పించుకొంటున్నాం. మన పనినీ మన జీవితాన్నీ క్రీనుతో చేర్చి తండ్రికి అర్పించుకొంటున్నాం. ఆ ప్రభువుతో కలసి మనం అంగీకార యోగ్యమైన బలి ఔతాం. ఈలా పూజబలితో కలసినప్పడు మన పని ధన్యమౌతుంది.

ఈ సందర్భంలోనే ఉదయకాల సమర్పణను గూర్చి రెండు మాటలు చెప్పాలి. ఉదయాన్నే మనం రోజుపొడుగున చేయబోయే వనులన్నిటిని వ్రభువుకి