పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

613 ఆజ్ఞలున్నాయి. క్రీస్తు వీటిని రెండుగా కుదించాడు. అవి దైవ ప్రేమ, సోదరప్రేమ. ఈ రెండు ప్రేమలను పాటిస్తే తప్పక రక్షణాన్ని పొందుతాం - మత్త 22, 36-40. కాని యోహాను సువిశేషం ఈ రెండు ప్రేమలను కూడ విశ్వాసం క్రిందికి తీసుకవచ్చింది. దేవుని కార్యాలను నెరవేర్చడానికి మేము ఏమి చేయాలని యూదులు క్రీస్తుని అడిగారు. దేవుడు పంపినవానిని విశ్వసించండి. అదే దేవుడు మీ నుండి కోరేది అని యేసు సమాధాన మిచ్చాడు - 6, 28–29. కనుక ఇప్పుడు మనలను గూర్చిన దేవుని చిత్తమేమిటి? మనం దేవుడు పంపిన క్రీస్తుని విశ్వసించి అతని ద్వారా రక్షణం పొందాలనే తండ్రి చిత్తం. పౌలు కూడ ఈ భావాన్నే సూచించాడు. అతడు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞాలను పాటించడం వల్ల మనకు రక్షణం కలగదన్నాడు. విశ్వాసంతో క్రీస్తు సిలువనూ రక్షణాన్నీ అంగీకరిస్తే రక్షణం కలుగుతుంది అని బోధించాడు. కనుక ఇప్పడు విశ్వాసమే రక్షణ సాధనం. ఐతే ధర్మశాస్త్రం సూచించినట్లుగా సత్ర్కియల వలన లాభం లేదా అంటే వుంది. అవి మన విశ్వాసాన్ని రుజువు చేస్తాయి. యకోబు జాబు కూడ ఈయంశాన్ని ప్రస్తావిస్తుంది. మన పుణ్యక్రియలే రక్షణాన్ని సాధించి పెట్టవు. విశ్వాసంతో కూడిన పుణ్య కార్యాలు రక్షణాన్నిస్తాయి - యాకో 2, 19–24.

రెండవది ప్రేమ. విశ్వాసం ప్రేమను రద్దుచేయదు. అవి రెండూ కలిసే పని చేస్తుంటాయి. ప్రేమాజ్ఞ క్రీస్తు శిష్యులకు ముఖ్య లక్షణం. నేను మిమ్మ ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించాలని క్రీస్తు నొక్కిచెప్పాడ. దాన్నిబట్టే మనం అతని శిష్యులంగా గణింపబడతాం అన్నాడు - యోహా 13, 34-35. మనం తోడివారిపట్ల ప్రేమ చూపామా లేదా అన్న అంశాన్ని పరస్కరించుకొనే లోకాంతంలో మనకు తీర్పు జరుగుతుంది - మత్త 25, 31-46. ఆ తీర్పును బట్టే మనకు మోక్షమో నరకమో వస్తుంది. ధర్మశాస్త్ర సారమంతా నీ పొరుగువానిని ప్రేమించు అన్న ఆజ్ఞలోనే ఇమిడివుంది - గల 5, 14.

ఇప్పడు మనం విశ్రాంతిని కోరతాం. కాని ప్రాచీనులకు విరామం అంటే యేమిటో తెలియదు. వాళ్ళ ఎప్పడూ పని చేసికొంటూనే వుండేవాళ్ళ. హీబ్రూ ప్రజలు కూడ నిరంతరం శ్రమ జేసారు. వారికి ఎప్పడైనా విశ్రాంతి అనేది వుంటే అది పర్వదినాల్లో మాత్రమే. పండుగలు పని నుండి విశ్రాంతిని పొంది దేవుణ్ణి పూజించడానికి ఉద్దేశింపబడ్డాయి.

ధర్మశాస్త్రం ఆరు రోజులు పని జేసి ఏడవరోజు విశ్రాంతిని పొందమని ఆజ్ఞాపించింది. దేవుడు ఆరు రోజులు సృష్టి చేసి ఏడవరోజు విశ్రాంతి తీసికొన్నాడనీ,