పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండవద్దని తన క్రైస్తవులను హెచ్చరించాడు. పనిచేయనివాడు తిండి తినడానికి అరుడుకాడని శాసించాడు - 2 తెస్స 3,6-10.

క్రీస్తు " నా తండ్రి ఇప్పటికీ పని చేస్తున్నాడు. నేనూ పని చేస్తున్నాను" అన్నాడు - యోహా 5,17. ఈ పని యేమిటి? లోక సృష్టి, లోకరక్షణం. ఈ కార్యాన్నితండ్రితోపాటు క్రీస్తు కూడ చేస్తాడు. ఇతడు తండ్రి పనిని కొనసాగించేవాడు. అతని అద్భుతాలు ఇందుకు ఉద్దేశింపబడినవే. తండ్రి నాచే చేయించే పనులు నన్ను గూర్చి సాక్ష్యమిస్తాయి అన్నాడు ప్రభువు - యోహా 5:36. ఈ పనులు ఏమిటివి? అతని అద్భుతాలే. తండ్రే క్రీస్తు ద్వారా ఈయద్భుతాలను నిర్వహించాడు. ఆ పనులన్నీకూడ అతడు దేవుని కుమారుడు, మెస్సీయా అని రుజువు చేస్తాయి. ఆ పనులు తండ్రిని మహిమపరుస్తాయి కూడ.

ఇంకా క్రీస్తు నన్ను పంపినవాని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు - 4:34. కాని తండ్రి చిత్తం ఏమిటి? కుమారుని సిలువ మరణం ద్వారా మానవ రక్షణ కార్యాన్ని సాధించడమే. ఇంకో పర్యాయం క్రీస్తు "నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి నిన్ను మహిమ పరచాను" అన్నాడు -17,4. ఈ వాక్యం గూడ సిలువ మరణాన్నే సూచిస్తుంది. అసలు క్రీస్తు పనులన్నీ అతని సిలువ మరణంతో సంబంధం కలవే. ఆ సిలువ మరణం తండ్రి అతని కార్యాలపై వేసిన ముద్రలాంటిది - 6, 27. కడన క్రీస్తు “శిష్యుల కొరకు నన్ను నేను ప్రతిష్టించుకొంటున్నాను" అన్నాడు — 17:19. ఈ "ప్రతిష్టించు కోవడం" అతని విధేయాత్మకమైన సిలువ మరణమే. ఈ సిలువ మరణం ముగిసినప్పడు అతడు “అంతా సమాప్తమైంది" అని ప్రాణాలు విడిచాడు - 19:30. అనగా తండ్రి అతని కొప్పజెప్పిన రక్షణకార్యం ముగిసింది. నరులకు పాపపరిహారం లభించింది. క్రీస్తు నిర్వహించిన సమస్త కార్యాల ద్వారా, విశేషంగా అతని సిలువ మరణం ద్వారా మన పనులు పవిత్రమయ్యాయి. అతని పనులన్నీ నేటి మన పనిమీద సోకి దాన్ని పునీతం చేస్తాయి. క్రీస్తు ముద్ర మన పనులమీద పడకపోతే వాటికి విలువ లేదు. ప్రభుత్వం వారి ముద్ర తెల్లకాగితం మీదపడి దానికి విలువ నిచ్చినట్లే, క్రీస్తు ముద్ర మన కార్యాలమీద పడి వాటిని పునీతం చేస్తాయి.

క్రీస్తు లోకానికి వెలుగు. అతడుమనం చేసేవి పాప కార్యాలో లేక పుణ్యకార్యాలో నిర్ణయిస్తాడు. దుప్రియలు చేసేవాళ్లు క్రీస్తు వెలుగును సమీపించడానికి దడిసి దానికి దూరంగా వుంటారు. వాళ్ల పాపకార్యాలు బట్టబయలు కావడం వాళ్లకు ఇష్టముండదు. సత్ర్కియలు చేసేవాళ్ళు మాత్రం వెలుగుని సమీపిస్తారు - 3, 19-21. ప్రభువుని విశ్వసించేవాళ్ళ మంచిపనులే చేస్తారు. విశ్వసించని వాళ్ళదుష్కార్యాలు చేస్తారు. యోహాను సువిశేషంలో క్రీస్తుని విశ్వసించక పోవడమే పెద్ద పాపకార్యం.