పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసాం అంత చేసాం అని డప్పాలు కొట్టగూడదు. అయోగ్యులమైన సేవకులం, మా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చాం అని వినయంగా వుండాలి - లూకా 17:10.

3. క్రీస్తు మరణోత్థానాల ద్వారా మన పని మనలను రక్షిస్తుంది

ఆదాము పాపం వలన పని బాధను తెచ్చిపెట్టిందన్నాం. క్రీస్తు మరణోత్థానాలు ఈ బాధను తొలగించవు. కాని అవి బాధలతో గూడిన మన పనిని పునీతం చేసి మనకు మోక్షాన్ని సాధించిపెడతాయి.

పూర్వవేదంలోనే పనినుండి ఉపశాంతిని కలిగించే అంశాలు కొన్ని వున్నాయి. యూదులకు శనివారం విరామదినం. నరులకూ జంతువులకూ గూడ పనినుండి విశ్రాంతి నీయడానికే ఈ దినం ఉద్దేశింపబడింది. మీరు ఆరు రోజులపాటు పనిచేసి ఏడవరోజు విశ్రాంతి పొందాలి. దీని వల్ల మీకు ఊరట కలుగుతుంది - నిర్గ 23:12. ఇంకా బానిసలకూ కూలివారికీ విశ్రాంతి కలిగించాలి. రాత్రి గడవకమునుపే కూలివాని కూలి చెల్లించాలి - లేవీ 19:13. యిప్రాయేలీయులు సీనాయి నిబంధనను పాటిస్తూ జీవిస్తే దేవుడు వారి కృషిని దీవిస్తాడు - ద్వితీ 16:15. ఐతే నూత్న వేదంలో వచ్చిన క్రీస్తు విశేషంగా మన పనిని దీవించేవాడు. ఈ విషయాన్ని విపులంగా పరిశీలిద్దాం.

క్రీస్తు స్వయంగా పనిచేసినవాడు. సువిశేషం అతడు “వడ్రంగి" అని చెప్తుంది - మార్కు 6:3. ఇక్కడ గ్రీకు మూలంలో వాడిన మాటకు (టెక్టోస్) "పనివాడు" అని మాత్రమే అర్థం. వడ్రంగం కూడ అతడు చేసిన పనుల్లో ఒకటై యుండవచ్చు. క్రీస్తు స్వయంగా శ్రమచేసి మన శ్రమకు విలువనిచ్చాడు. అతని పని ఇప్పడు మన పనిమీద సోకుతుంది. పౌలుకూడ క్రీస్తుని అనుకరించి పనివాడుగానే జీవించాడు. అతడు గుడారాలు తయారు చేసేవాడు - అచ 18:3.

క్రీస్తు ఈ లోకానికీ ఇక్కడి పనికీ విలువ నిచ్చాడు. ఈ లోకం మనలను పరలోకానికి తయారు చేస్తుంది. ప్రభువు తన బోధల్లో లోకవిషయాలు ప్రస్తావించాడు. గొర్రెలు కాచే కాపరి, ద్రాక్షలు సాగుచేసే తోటమాలి, విత్తేవాడు, ఇల్లపూడ్చే గృహిణి మొదలైన వుపమానాలు వాడాడు, ఇవన్ని శ్రమజేసేవాళ్లను గూర్చి చెప్పేవే కదా! ఇంకా అతడు ప్రేషితసేవను పంటను ప్రోగుజేయడంతో పోల్చాడు - మత్త 9, 37 - 38. చేపలను పట్టడంతో కూడ ఉపమించాడు - 419. కనుక పనంటే అతనికి ఇష్టమే. క్రీస్తుని బాగా అర్థంజేసికొన్న పౌలు కూడ సోమరితనాన్ని నిరసించాడు. సోమరులుగా