పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రైతు దృష్టి అంతా
తిన్నగా నాగటి చాలు వేయడం మీదనే వుంటుంది
అతడు రేయి ప్రొద్దుబోయినదాక పసులను మేపుతాడు
కుమ్మరి తన పని మీదనే మనసు నిల్పి
నేనెన్నికుండలు చేస్తానా అని ఆలోచిస్తాడు
బంకమట్టిని కాళ్లతో తొక్కి చేతులతో మలుస్తాడు
తరువాత కుండకు మెరుగుపూత పూస్తాడు

సీరా - 38: 26-30. ఇంకా బైబులు రచయిత సాలోమోను సింహాసనాన్ని మెచ్చుకొన్నాడు. ఏ రాజు ఆలాంటి సింహాసనాన్ని చేయలేదని ప్రశంసించాడు - 1 రాజు 10:20. ఈ రాజు ఏడేండ్లలో దేవాలయాన్ని కట్టి ముగించినందుకు అతన్ని ప్రశంసించాడు - 1 రాజు 6:38.

జ్ఞానులు గూడ పనిని గూర్చి చాల మంచి భావాలు చెప్పారు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే మన కృషి మాత్రమే చాలదు. దైవ బలం కూడ వుండాలి.

ప్రభువు ఇల్లు కట్టకపోతే
బేలుదారుల శ్రమ వ్యర్థమౌతుంది
దేవుడు నగరాన్ని కాపాడకపోతే
గస్త్రీలు మేల్కొని వుండీ లాభం లేదు - కీర్త 127:1.

నీ కార్యాలన్నిటిలోను ప్రభువుని స్మరించుకో
అతడు నీ పనులను సులభతరం చేస్తాడు - సామె 3:6

నరుడు పథకాలను సిద్ధం చేయవచ్చుగాక
అతని పనులను నడిపించేది ప్రభువే - 16:9

దేవుడు విశ్వానికంతటికీ అధిపతి. కాని అతడు నరుణ్ణి ఈ భూమికి అధిపతిని చేసాడు. భూమి ఆకాశం సముద్రాల్లో పండే ప్రాణులన్నిటిని అతని పాదాల క్రిందవంచాడు - కీర్త 8:6-7.

గ్రీకు ప్రజలు పనిని రెండురకాలుగా విభజించారు. చేతితో చేసేపని లేక కాయకష్టం విలువలేనిది. బానిసలు దాన్ని చేస్తారు. తలతో చేసే పని విలువైనది. సమాజంలో ఉన్నతులు ఆ పనిని చేస్తారు. కాని బైబులు ఈ విభేదాన్నిఅంగీకరించలేదు. దేవుని దృష్టిలో ప్రతిపని విలువైందే. ఏ పని చేసినా నరుడు భగవంతునికి ప్రీతి