పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను ప్రధాన శిల్పిలాగ
అతని చెంత నిల్చివున్నాను
అతడు చేసిన పుడమిమీద క్రీడిస్తూ
ప్రమోదంగా మానవాళి మధ్య మనుతున్నాను

- సామె 8, 31. ఈ జ్ఞానం ద్వారానే దేవుడు సృష్టి నంతటినీ చేసాడు. దేవుడు లోకాన్ని ఏలా చేసాడు అని ప్రశ్నించుకొని పవిత్ర రచయితలు ఈలా వాకొన్నారు. కుమ్మరి కుండను చేసినట్లుగా దేవుడు లోకాన్ని చేసాడు. అతడు నేలమట్టిని తీసికొని దానినుండి మానవాకృతిని మలిచాడు. దాని ముక్కు రంధ్రాల్లోనికి ప్రాణవాయువును వూదగా అది జీవించే ప్రాణి ఐంది. ఆ ప్రాణే ఆదాము - ఆది 2,7. యెషయా ప్రవచనం 45,9లో కూడ ఇదే భావం కన్పిస్తుంది

మట్టి తన్ను చేసిన కుమ్మరితో పాదం చేస్తుందా?
మన్ను కుమ్మరితో నీవేమి చేస్తున్నావని అడుగుతుందా?
కుండ కుమ్మరితో నీకు నేర్పు చాలదని అంటుందా?

కాని ఇది కేవలం రచయితల ఊహ మాత్రమే. దేవుడు మనలాగ చేతులతో పనిచేసాడు అనుకోగూడదు. అతడు ఇచ్చామాత్రంగానే, ఒక్క ఆజ్ఞతోనే, ఒక్క పలుకుతోనే లోకాన్ని చేసాడు. కనుకనే రబ్బయిలు "ఎవడు ఒక్క పలుకు పలకగానే లోకాలు పట్టాయో ఆ దేవుడు" అని వాకొన్నారు.

యిస్రాయేలీయులు ఆరవ శతాబ్దంలో బాబిలోనియా ప్రవాసంలోగాని దేవుణ్ణి లోకాన్నిచేసిన సృష్టికర్తనుగా అర్థం చేసికోలేదు. భగవంతుడు చేసిన సృష్టిలో ఉత్తమోత్తముడు నరుడు. దేవుడు అతన్ని తనకు పోలికగా చేసాడు - ఆది 1,27. అనగా తనలాంటి వాణ్ణిగా చేసాడు. దేవుని శ్వాస, ఆత్మ అతనిలో వున్నాయి. అసలు దేవుడే భూమిమీద తిరుగుతున్నాడో అనిపించేవాడు నరుడు, ఇక దేవుడు సృష్టి చేసేవాడు అన్నాం. కనుక అతనికి పోలికగా వున్న నరుడుకూడ సృష్టి చేసేవాడు కావాలి. నరుడు నూత్న సృష్టి చేయడుకాని దేవుడు చేసిన సృష్టిని కొనసాగించుకొని పోతాడు. దాన్ని పరిపూర్ణం చేస్తాడు. అందుకే దేవుడు మీరు భూమిమీద వ్యాపించి దాన్ని వశం చేసికొనండి అని ఆదిదంపతులతో చెప్పాడు - ఆది 1,28. ఆదాము కాలంనుండి నరులు పనిచేస్తూనే వున్నారు. ఈ నరుల పనిలో మళ్లా తేడాలున్నాయి. కొందరు గొప్ప కార్యాలు చేస్తారు. కాని అధిక సంఖ్యాకులు చేసేది మామూలు పనులే. కాని వాళ్ల తాము చేసే మామూలు పనితోనే లోకాలు నిల్పుతారు - సీరా 38,34 ఈ సామాన్య నరులు చేసే మామూలు పనినిగూర్చే కీర్తన 104,23.