పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. భారతీయ తిరుసభకే మొదట వేదబోధ

భారతీయ తిరుసభలో రెండు పనులు ఆవశ్యం జరగాలి. మొదటిపని, భారతీయ తిరుసభే వేదబోధను పొందాలి, మన ప్రజలకు వ్యక్తిగతమైన పరివర్తనం అవసరం. మనం కొలిచే భగవంతుడు పరమ పవిత్రుడు. అపవిత్రుడైన నరుడు అతని సన్నిధిలోనికి రాలేడు.

మన ప్రజల్లో కుల భేదం, వర్గభేదం పోవాలి. క్రీస్తు ద్వారా మనమందరం సరిసమానం. కులాల వారిగా విడిపోతే క్రీస్తుశక్తి మన మీద పనిచేయదు.

మనదేశంలో చాలమంది నిరుపేదలు, ఉన్నవాళ్లు ఈ లేనివాళ్ళను ఆదుకోవాలి. అన్యాయాలు పరపీడనంపోయి ప్రజలకు విముక్తి రావాలి. సమ సమాజం ఏర్పడాలి.

బిషప్పులకీ గురువులకీ మఠసభల సభ్యులకీ మధ్య వుండే తగాదాలూ సమసిపోవాలి. మనలో మనం కొట్లాడుకొంటుంటే దైవరాజ్యాన్ని ఏలా స్థాపిస్తాం? అలాగే గృహస్థలకూ మతాధికారులకూ వందే తగాదాలు కూడ సమసిపోవాలి. మన తిరుసభలో గృహస్థల ప్రమేయం ఇప్పటికంటె అదనంగా పెరగాలి. భారతీయ తిరుసభ క్ర్తెస్తవ సమైక్యతను గూడ సాధించాలి. ఇవన్నీ భారతీయ తిరుసభ వేదటోధను పొందినందువల్ల కలిగే ఫలితాలు. మొదట మనం వేదబోధను పొంది హృదయ శుద్ధినీ ఆత్మ ప్రేరణనూ సాధించిన పిదపనేగాని వేరేవాళ్ళకు వేదబోధ చేయలేం. మన కార్డినల్సు బిషప్పులు మొదట భారతీయ తిరుసభే వేదబోధను పొందాలని కోరారు.

4. భారతీయ తిరుసభ చేయవలసిన వేదబోధ

ప్రపంచ మంతటా క్రీస్తుని బోధించాలని పాపగారి కోర్కె మనదేశంలో మనం కూడ ఆ ప్రభువుని గూర్చి బోధించాలి. ఇది రెండవ పని. ముందుగా వేదబోధకులు పాటించవలసిన సూత్రాలను కొన్నిటిని పరిశీలిద్దాం.

1. వేదబోధకులకు గొప్ప వినయం వుండాలి. మన శక్తిసామర్థ్యాల వల్లనే మనం అన్యుల హృదయాల్లో విశ్వాసం పట్టిచంలేం. విశ్వాసం ప్రధానంగా దేవుడిచ్చే వరం. మనం కేవలం సాధన మాత్రులం.

2. భగవంతుణ్ణి గూర్చి బోధించే వాళ్ళకు భక్తి కూడ వుండాలి. మనకు అనుభవానికిరాని భగవంతుణ్ణి గూర్చి ఇతరులకు చెప్పలేం. వారిని సులువుగా నమ్మించలేం. బోధ చేయకముందు మనం దీర్ఘకాలం ప్రార్థనలో గడిపి వండాలి. విశేషంగా మన బోధ