పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. ఈ వేదబోధను ప్రస్తుత పాపుగారు చాలసార్లు "నూత్న వేదబోధ" అని పేర్కొన్నారు. కాని దీనిలోని నూత్నత్వం ఏమిటి? ఇంతకు పూర్వం వేదబోధ జరగలేదని భావమా? పూర్వవేదంలో ప్రవక్తల కాలం నుండీ, నూత్నవేదంలో శిష్యుల కాలంనుండీ వేదబోధ జరుగుతూనే వుంది. అనగా యిప్పటికి 3000 ఏండ్లనుండి ఈ వేదబోధ జరుగుతూనే వుంది. ఇకమీదట కూడా జరగబోతూంది. ఐనా ఇప్పడు తలపెట్టిన బోధతో కొన్ని నూత్నాంశాలున్నాయి. అవి యివి.

1965లో రెండవ వాటికన్ మహాసభను ప్రారంభించడానికి ముందూ, 1975లో వేదబోధన గూర్చి ఆరవ పాల్ పాపగారి శ్రీముఖం వెలువడక ముందూ క్రైస్తవేతరులకు జ్ఞానస్నానమీయడానికి చేసేదాన్ని మాత్రమే వేదబోధ అన్నారు, ఆ రోజుల్లో మత విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు మాత్రమే వేదబోధ క్రిందికి వస్తాయి అనుకొన్నారు. కాని యిప్పడు వేదబోధ అంటే నరుల ఆత్మకూ దేహానికీ సంబంధించిన అంశాలుకూడ దేహాత్మలతో కూడిన నరుల పూర్తి శ్రేయస్సును కోరేదే వేదబోధ అని యిప్పడు భావిస్తున్నారు. ప్రజలను కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమేకాక, ఆర్థికంగా సాంఘికంగాగూడ వృద్ధిలోకి తీసికొని రావాలని నేటి వేదబోధకుల తలంపు, ఈ విధంగా వేదబోధకు విస్తృతార్థం వచ్చింది. కనుక ఇది నూత్న వేదబోధ ఐంది.

మరో అర్థంలోకూడ ఈ బోధ నూత్న బోధ ఔతుంది. విశ్వాసాన్ని కోల్పోయిన పాశ్చాత్య దేశాలకు ఇప్పడు మళ్ళా రెండవసారి బోధ చేయబోతున్నారు. కనుక ఇది వాళ్ళకు క్రొత్త బోధ ఔతుంది కదా!

ప్రస్తుత వేదబోధలో ఇంకో నూత్నాంశం కూడ ఉంది. ఇప్పడు మనం ప్రార్థనలతో, ఉత్సాహంతో, ప్రాయశ్చిత్తంతో నియమిత ప్రణాళికతో, బృందాలు గాను మూకుమ్మడిగాను వెళ్లి వేదబోధ చేయబోతున్నాం. పూర్వం జరిగిన వేదబోధలో ఈ సన్నాహాలన్నీ లేవు. కనుక, పై మూడంశాలను పరస్కరించుకొని దీన్ని నూత్న వేదబోధ అన్నారు. - 4. ఈ వేదబోధ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది విశేషంగా మూడు వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది. మొదటి వర్గం వాళ్ళ భక్తివిశ్వాసాలు కల క్రైస్తవ ప్రజలు. వీళ్ళకొదిలగానో గొప్పగానో ప్రపంచమంతటా వ్యాపించి వున్నారు. ప్రస్తుత వేదబోధ వీళ్ళ విశ్వాసాన్ని పెంచుతుంది. వీళ్ల పూర్వం కంటె గూడ ఎక్కువ భక్తిని అలవర్చుకొంటారు. రెండవ వర్గంవాళ్ళ భక్తిని కోల్పోయిన క్రైస్తవలు, తమ తాతలూ తండ్రులూ క్రైస్తవులైనా ఇప్పుడు వీళ్లు మాత్రం క్రైస్తవులుగా జీవించటం లేదు. వీళ్ళ ఎక్కువగా యూరపులోను అమెరికాలోను వున్నారు. ప్రస్తుత వేదబోధ వీళ్ళకు మళ్ల విశ్వాసాన్ని పట్టిస్తుంది.