పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. వేదబాధ

బైబులు భాష్యం - 123

విషయసూచిక

1. వేదబోధ 2. బైబులు - వేదబోధ 3. భారతదేశ పరిస్థితి

1. వేదబోధ

ఈ మొదటి ఆధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం. 1. వేదబోధకు పూనుకోవడమనేది వ్యక్తిగతమైన విషయమా లేక తిరుసభ కోరికా? ఇది వ్యక్తిగతమైన అంశంకాదు. తిరుసభే వేదబోధను అధికార పూర్వకంగా ఆదేశించింది. రెండవ వాటికన్ మహాసభ 30 ఏండ్లకు పూర్వమే ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆరవ పాల్ పాపుగారు వేదబోధను గూర్చి పెద్ద శ్రీముఖమే వ్రాసారు. ఇక రెండవ జాన్ పాల్ పాపగారు చాల తావుల్లో చాల సందర్భాల్లో ఈ యంశాన్ని నొక్కి చెపూ వచ్చారు. కనుక ఈ కార్యక్రమాన్ని మనమందరమూ శ్రద్ధతో చేపట్టాలి.

2. నూత్న వేదబోధ చేయడానికి ఇప్పడు మంచి తరుణం లభించింది. దీన్ని మనం సద్వినియోగం చేసికోవాలి. ఏమిటి ఈ తరుణం? నేడు పాశ్చాత్యదేశాల్లో విశ్వాసం నశించింది. మనం చూస్తూ ఊరుకోగూడదు. ప్రయత్నంచేసి నశించిన విశ్వాసాన్ని నూత్నబోధద్వారా పునరుద్ధరించాలి. గత 80 ఏండూ కమ్యూనిస్టులు రష్యా పాలనలోకి వచ్చిన దేశాల్లో విశ్వాసాన్ని రూపుమాపారు. కాని ఇప్పడు ఆ దేశాలకు స్వేచ్ఛ లభించింది. కనుక ఆ దేశాల్లో వేదబోధ చేయడానికి మనకు మంచి అవకాశం లభించింది అనుకోవాలి. ఇంకా ఇండియా చైనా, ఆఫ్రికా మొదలైన దేశాల్లోకూడ వేదబోధ చేయడానికి ఇది మంచి తరుణం. ఈ యవకాశం దాటిపోతే మళ్ళా వేదబోధకు పూనుకోవడం కష్టం. సువార్తను బోధించిన తావులన్నిటిలోను ఎన్నో సత్ఫలితాలు లభించాయి. ఇండియాలాంటి పెద్ద దేశాలకు మాత్రం ఈ ఫలితాలు అందవద్దా?

అన్నిటికంటె గొప్ప తరుణం ఇది. క్రీస్తు జన్మించి రెండువేల యేండ్లు ముగిసాయి. ప్రభువు జ్ఞాపకార్థంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్దయెత్తున జూబిలీ జరుపుకొన్నాం, ఈ సమయంలో సహజంగా భక్తి ఉత్సాహాలు చూపుతాం. కనుక ఇది వేదబోధకు మంచి తరుణం.