పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆచరణ రీత్యా నాస్తికులు. వీళ్లల్లో విశ్వాసం పూర్తిగా చచ్చిపోలేదు కొని చురుకుగా పనిమాత్రం చేయదు. ఈలాంటి వాళ్ల ఆధ్యాత్మిక విషయాలపట్ల తమకు ప్రీతి పట్టించమని వినయంతో దేవుణ్ణి అడుగుకోవాలి. తమ హృదయంలో లౌకిక మనస్తత్వం వేళ్లు పాతుకోకుండా వుండేలా చూచుకోవాలి. 2. ఇక భక్తిగల క్రైస్తవుల విషయాన్ని చూద్దాం. వీళ్ళల్లో విశ్వాసదీపం ప్రకాశవంతంగా వెలుగుతూనే వుంటుంది. ఐనా వీళ్ళు తమ శ్రద్ధను ఇంకా అధికంచేసికోవచ్చు. భక్తిగల క్రైస్తవులు బైబులును, విశేషంగా సువిశేషాలను శ్రద్ధతో చదువుకోవాలి. క్రీస్తు బోధలనూ అతని ప్రవర్తనా సరణినీ క్షుణ్ణంగా అర్థంచేసికోవాలి. అతన్ని అనుకరించాలి, ధ్యానం చేసికోవాలి. క్రీస్తుపట్ల భక్తి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. భక్తిపరులు అన్నిటిలోను దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించాలి. మొదట వాళ్లు సృష్టివస్తువుల్లో దేవుణ్ణి చూడాలి. మమ్మ మేము చేసికోలేదు దేవుడే మమ్మ చేసాడు అని అని ఫరోషిస్తాయి. ఇంకా వాళ్ళ అందరు నరుల్లోను దేవుణ్ణి గుర్తించాలి, తోడి నరులు భగవంతుని బిడ్డలు, అతని రూపాలు, క్రీస్తుకి తమ్ముళ్ళూ చెల్లెళ్ళూను. కనుక తోడివారిలో దేవుణ్ణి దర్శించడం గొప్ప భక్తి పైగా వాళ్ళ అన్నిసంఘటల్లోను దేవుని హస్తాన్ని గుర్తించాలి. దేవుని అనుమతిలేందే లోకంలో ఏ కార్యమూ జరగదు. ప్రభుపుకి తెలియకుండా మన తలవెండ్రుక ఒక్కటి ఊడిపడదు - మత్త 10, 30. ప్రభువు ఈ జీవితంలో జరిగే మంచిచెడ్డలన్నీ మన రక్షణకు ఉపయోగపడేలా చేస్తాడు. అన్ని సంఘటనలు మన మంచికే జరిగేలా చూస్తాడు - రోమా 8, 28. ఈ విధంగా సృష్టి వస్తువుల్లోను, తోడినరుల్లోను, ఆయా సంఘటనల్లోను దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించి మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. మంచివాళ్ళు తమ ఆలోచనల్లోను చేతల్లోను మాటల్లోను విశ్వాసాన్ని ప్రదర్శించాలి. వాళ్ళతలపలు సువిశేష సూక్తులవల్ల ప్రభావితమై వండాలి. వాళ్ళపలుకుల్లో ఈ లోకపు విలువలుకాక ఆధ్యాత్మిక విలువలు కన్పిస్తుండాలి. వారి పనులు క్రీస్తు పనులను పోలివుండాలి, అంతేకాని ఈ లోకంలోని పాపపు మానవుల పనులను పోలివుండకూడదు, ఈ విధంగా మన త్రికరణాల్లోను విశ్వాసం ప్రదర్శితమౌతుండాలి. నీతిమంతులు తమ విశ్వాసం వలన జీవిస్తారు - హబ 2,4. పైగా వాళ్ళు తాము సాధించిన విశ్వాసాన్ని ఇతరులకుకూడ అందిస్తారు. వాళ్ల ప్రజల్లో భక్తి విశ్వాసాలు పెంపొందాలని ప్రార్ధనచేస్తారు. నీతిమంతుల మంచిపనులనూ పుణ్యక్రియలనూ చూచి భక్తిని కోల్పోయినవాళుకూడ దేవుని దగ్గరకు తిరిగివస్తారు. వారి మృదువైన మందలింపులనూ హెచ్చరికలనూ గుర్తించి భక్తిలేనివాళ్లు సిగ్గుతెచ్చుకొంటారు. శీఘమే ప్రబోధంచెంది దేవుని దగ్గరికి-తిరిగివచ్చి ఆ ప్రభువును పూజించుకొంటారు. విశ్వాసప్రభావం ఈలా వుంటుంది.