పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17,5. అప్పుడప్పుడు కాసేపు స్తిమితంగా కూర్చుండికేవలం విశ్వాస ప్రార్ధనం చేసికోవడం మంచిది. ఈ ప్రార్ధనలో ప్రభుని గాఢంగా విశ్వసించే భాగ్యం కొరకు అడుగుకోవాలి. మన తరపున మనం భగవద్భక్తినీ శ్రద్ధనీ పెంపొందించే గ్రంథాలు చదవాలి. బైబులు, క్రీస్తు అనుసరణ గ్రంథం ఈలాంటివి. కొన్ని పుస్తకాలు దైవభక్తిని హేళన చేస్తాయి. నాస్తిక భావాలను ప్రబోధిస్తాయి. ఈలాంటి గ్రంథాలు మనకు పనికిరావు. అన్ని వేదసత్యాలు మనకు అర్ధంకావు. కాని మనం అర్థం అర్ధం చేసికోలేని వేదసత్యాలను నిరాకరించకూడదు. ఒకోసారి దేవుడు మనతో మెలిగేతీరు మనకు సరిగా బోధపడదు. విశేషంగా దేవుడు ఆయా కష్టాలను ఎందుకు పంపుతాడో మనకు తెలియదు. కనుక శ్రమలు వచ్చినపుడు మనం దేవునిమీద మొరపడకూడదు. కొన్నిసార్లు విశ్వాసానికి వ్యతిరేకమైన శోధనలు వస్తూంటాయి. పరలోకం మోక్షనరకాలు నిజంగా పన్నాయా అని సందేహం కలుగుతూంటుంది. అసలు భగవంతుడు ఉన్నాడా అని అనుమానం కలుగుతుంది. అనాదికాలం నుండి నరులంతా వట్టినే భ్రంతి పడుతున్నారేమో అని శంక కలుగుతుంది. అలాంటప్పుడు కూడ వినయంతో దేవునికి ప్రార్థన చేసికోవాలి. మూగదయ్యం పట్టిన పిల్లవాడి తండ్రిలాగ ప్రభూ! నేను నిన్ను నమ్ముతూనే వున్నాను. ఐనా నాలో ఏమైనా అవిశ్వాసముంటే దాన్ని నీవే తొలగించు అని అడుగుకోవాలి - మార్కు9,24 తెలిసినవాళ్ళనడిగి వేదసత్యాలను గూర్చిన సందేహాలను నివృత్తి చేసికోవాలి.

దేవద్రవ్యానుమానాలన్నీ విశ్వాసాన్ని పెంచేవే. కనుక మనం భక్తితో పూజలో పాల్గొని దివ్యసత్రసాదాన్ని స్వీకరించాలి. శ్రద్ధతో పాపసంకీర్తనం చేసికోవాలి. వివాహ దేవద్రవ్యానుమాన మిచ్చే ప్రత్యేక వరప్రసాదంతో పవిత్రంగా జీవించాలి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురౌతాయి. తరచుగా మనలను తన దగ్గరికి రాబట్టుకోవడానికే దేవుడు కష్టాలను పంపుతూంటాడు. అవి లేకపోతే మనం ఆ ప్రభువుని పూర్తిగా మర్చిపోతాం. శ్రమలు మనకు ఎన్నో పారాలు నేర్పిపోతాయి. అవి చేసే మంచిపని మన విశ్వాసాన్ని పెంచడం. అగ్ని బంగారాన్ని పరీక్షిస్తుంది. మన విశ్వాసాన్ని శ్రమలు పరీక్షిస్తాయి. నిప్పవల్ల బంగారం మెరుగెక్కుతుంది. బాధలవల్ల మన విశ్వాసం మెరుగెక్కుతుంది - 1 పేత్రు 1,6-7. కనుక మనం కష్టాల్లో దేవుని హస్తాన్ని గుర్తించి ఆ ప్రభువుని ఇంకా అధికంగా నమ్మాలి. నేడు చాలమంది క్రైస్తవులు వట్టి లౌకిక జీవితం గడుపుతున్నారు. వీళ్ళ దేవుడు లేడనిచెప్పరు. కాని రోజువారి జీవితంలో మాత్రం దేవుడు లేడో అన్నట్లుగానే ప్రవర్తిస్తూంటారు. కూడు గుడ్డ యిల్ల వాకిలి డబ్బుజేసికోవడం ఉద్యోగం - వీటితోనే సరిపెట్టుకొంటారు. దైవకార్యాల్లో ఏమాత్రం శ్రద్ధజూపరు. వీళ్ళ సిద్ధాంతరీత్యా కాదుగాని