పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రద్ధద్వారా దేవుని వెల్లురు మనమీద ప్రసరిస్తుంది. మనం దైవ జ్ఞానంతో నిండిపోతాం. నరులు ఇంద్రియాలద్వారా, బుద్ధిశక్తి ద్వారా, విశ్వాసం ద్వారాగూడ జ్ఞానాన్ని ఆర్థిస్తారు. కాని విశ్వాసం ద్వారా ఆర్థించే జ్ఞానం అన్నిటికంటె శ్రేష్టమైంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానమే. దీనితోనే మనం వేదసత్యాలను గ్రహించేది.

కేవలం బుద్ధిశక్తి వల్ల మనకు దేవుణీ గూర్చి తెలిసేది చాల తక్కువ, విశ్వాసం వల్లనే ఆ ప్రభువు పిత సుతుడు పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా వున్నాడని నమ్ముతాం. సుతుడు నరావతారమెత్తి మనలను రక్షించాడనీ, అతని ద్వారానే మనం దేవునికి దత్తపత్రుల మౌతామనీ గ్రహిస్తాం. దేవుని ఆత్మ మన హృదయాల్లో వసించి మనలను దేవాలయాలుగా మారుస్తుందని విశ్వసిస్తాం.

శ్రద్ధ ద్వారా దేవుని నుండి దైవబలాన్ని పొందుతాం. ఈ బలంద్వారానే ఈ లోకంలో సంభవించే కష్టాలను భరించగల్లుతున్నాం. పౌలు చెప్పినట్లుగా, ఇప్పడు మనం అనుభవించే కష్టాలు మనకు రాబోయే మహిమతో ఎంతమాత్రం పోల్చదగినవి కావు అని నమ్మగల్లుతూన్నాం - రోమా 8, 18.

శ్రద్ధ మనకు ఓదార్పునిస్తుంద. ఈ ఓదార్పువల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలను భరిస్తాం. మనకు ప్రీతిపాత్రులైనవారు చనిపోయినప్పడు కలిగే శోకానికి తట్టుకొంటాం. మరణం వల్ల మన జీవితం అంతంగాదు, మనకు క్రొత్త జీవితం ప్రారంభమౌతుందని నమ్ముతాం.

శ్రద్ధ మనకు ఎంతో పవిత్రతను ఆర్థించి పెడుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మి అతన్ని ఆరాధించడం వల్ల మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. దేవుణ్ణి నమ్మి మనం చేసే కార్యాలకు గూడ ఎంతో విలువ వుంటుంది. దేవుణ్ణి విశ్వసించేవాళ్ళ బుద్ధిశక్తి చిత్తశక్తి క్రియాశక్తి దేవునికి లోబడతాయి. దీనివల్ల కూడ ఎంతో పుణ్యo లభిస్తుంది. కనుక విశ్వాసం ద్వారా నరుడు అన్నివిధాల పునీతుడౌతాడు.

B. విశ్వాసాన్ని పెంచుకోవడం ఏలా?

1. మొదట చాలినంత భక్తిలేని క్రైస్తవుల విషయం చూద్దాం. విశ్వాసంలో వృద్ధి చెందాలంటే దేవునికి ప్రార్థన చేసికోవాలి. శ్రమచేసి భక్తిమంతమైన జీవితం గడపాలి.

ఈ దేశంలో మనం నిరంతరం అన్య మతస్తుల మధ్య వసిస్తూంటాం. ఐనా మన విశ్వాసాన్ని కొదో గొప్పో నిల్పుకోగల్లుతున్నాం. దీనికి దేవునికి వందనాలు చెప్పకోవాలి. శ్రద్ధ ప్రభువు దయచేసే వరం. ఈ వరానికి మనం దేవునికి కృతజ్ఞలమై యుండాలి - 2 కొ 9,15 .

ఎప్పడూ మనకు చాలినంత విశ్వాసం వుండదు. కనుక శిష్యుల్లాగే మనం కూడ ప్రభూ! మా విశ్వాసాన్ని పెంపొందించు అని క్రీస్తుని అడుగుకోవాలి — లూకా 150