పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పడు. నమ్మదగినవాడు. ఈ పెద్దమనిషి మాటలకంటె గూడ అధికంగా దేవుని మాటలు నమ్మదగినవి. అతడు మనలను మోసగించేవాడు గాదు, ఓ తండ్రిలా తల్లిలా మన శ్రేయస్సును కోరేవాడు, ఇంకా మనం అతన్ని మోసగించలేం, ఈలా మనలను మోసగించనివాడూ, మన మోసానికి లొంగనివాడూ ఐన దేవుని పలుకులను నమ్ముతాం, అంగీకరిస్తాం. విశ్వాసంలో ముఖ్యమైన అంశం ఇదే. ఇక్కడ ఏమి నమ్మాం అన్నదానికంటె ఎందుకునమ్మాం, ఎవరిని బట్టి నమ్మాం అన్నవి ముఖ్యమైన ప్రశ్నలు. విశ్వసమంటే ఏవో కొన్ని అమూర్తమైన వేద సత్యాలను నమ్మడంకాదు. వాటిని తెలియజేసిన దేవుణ్ణి నమ్మడం.

5. వేద సత్యాలను పూర్తిగా అర్థంజేసికొని నమ్మం. అర్థంజేసికోకుండానే నమ్ముతాం. వాటిని పూర్తిగా తెలిసికొని అంగీకరించం. తెలిసికోకుండానే అంగీకరిస్తాం. శ్రద్ధలోని చిక్మంతా ఇక్కడే వుంది. చూడకుండా నమ్మడం కష్టం గదా? కాని మోసగించనివాడూ మోసానికి లొంగనివాడూ ఐన దేవుణ్ణి బట్టే ఈ సత్యాలను నమ్ముతాం.

కంటికి గోచరమయ్యే అంశాలపైగాక అగోచరమైన అంశాలపై మా శ్రద్ధను కేంద్రీకరిస్తున్నాం అన్నాడు పౌలు - 2 కొ 4,18. ఇంకా అతడే ఇప్పడు మనం చూచేది అద్దంలో మసకగా కన్పించే ప్రతిబింబంలాంటిది. కాని అప్పడు ముఖాముఖి చూస్తాం అన్నాడు - 1కొ 13, 12 క్రీస్తు కూడ తోమాతో చూడకుండా నన్ను విశ్వసించేవాళ్లు ధన్యులు అన్నాడు - యోహా 20, 29.

కనుక విశ్వసించేవాళ్ళు ఎప్పడూ చీకట్లో, సొరంగంలో నడుస్తూంటారు. తడువుకొని తిరుగుతూంటారు. అబ్రాహాము జీవితాంతం ఆలా తడుపుకొంటూనే పోయాడు. మరియమాతా అర్చ్యశిష్ణులుకూడ చీకట్లోనే నడచారు. కార్డినల్ న్యూమను కూడ

నడిపించు నన్ను కరుణామయ జ్యోతీ
ఆలముకొన్నవి చీకట్ల అన్నివైపులా
ఎటుచూచినా గాధాంధకారం
నేనింకా యిల్లు చేరలేదు
నడిపించు నన్ను ముందుకి జ్యోతీ
కోరుకోను దూరాన వున్నవి చూడాలని
నిలుపు నీవు నా పాదాలను దృఢంగా
ఒక్క అడుగు ముందుకి వేయించు నాచేత

అని ప్రార్థించాడు. నేడు మనంకూడ విశ్వాస జీవితం గడపాలంటే చీకట్లో పయనింపవలసిందే.

6. అన్ని ఆధ్యాత్మికాంశాల్లాగే మన శ్రద్దకూడ ఈ లోకంలో ప్రారంభమై "పరలోకంలో ముగుస్తుంది. అసలు మన శ్రద్దకు క్రీస్తే ఆధారం. క్రీస్తు రక్షణగాథ అతని రెండవ రాకడతోగాని ముగియదు, కనుక మన శ్రద్దకూడ ప్రభువు రెండవ రాకడతోగాని