పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. విశ్వాస స్వరూపం

1. విశ్వాసం అంటే యేమిటి?

1. దేవుడు మనకు తెలియజేసిన వేదసత్యాలను దృఢంగా నమ్ముతాం. దేవుని వాక్కునుబట్టే ఈ సత్యాలను నమ్ముతాం. ఇదే విశ్వాసం. విశ్వాసానికి మరో పేరు శ్రద్ధ.

తండ్రి క్రీస్తుద్వారా మనతో మాట్లాడాడు. పూర్వం ప్రవక్తలద్వారా మాట్లాడిన దేవుడు ఈ కడపటి దినాల్లో తన కుమారునిద్వారా మనతో మాట్లాడాడు - హెబ్రే 1.1 తండ్రి క్రీస్తు మరణోత్థానాలద్వారా మనలను రక్షిస్తానని మాట యిచ్చాడు. ఆ మాట ప్రకారమే క్రీస్తుని పంపి మనలను రక్షించాడు. క్రీస్తుద్వారా మన రక్షణ ప్రణాళిక నెరవేరింది.

ఇక, తండ్రి క్రీస్త ద్వారా మనతో చెప్పిన మాటలకు మనమిచ్చే జవాబే విశ్వాసం. అనగా తండ్రి మనకు తెలియజేసిన రక్షణ ప్రణాళికను మనం అంగీకరిస్తే అదే మన విశ్వాసం ఔతుంది.

2. మనం దేనితో నమ్ముతాం ? బుద్ధిశక్తితో మొదట దేవుడు తెలియజేసిన సత్యాలను గ్రహించేది మనలోని బుద్ధిశక్లే మనం చూచికాక చూడకుండా విశ్వసించాలి. కాని తాను చూడని సంగతులను బుద్ధిశక్తి ఏలా గ్రహిస్తుంది? ఏలా అంగీకరిస్తుంది? దేవుని వరప్రసాదం మన బుద్ధిశక్తిమీద పనిచేసి దానికి ఓ రకమైన వెలుగుని ప్రసాదిస్తుంది, ఆ వెలుగువల్ల మన బుద్ధిశక్తి దేవుడు నమ్మదగిన వాడని గ్రహించి అతడు తెలియజేసిన వేదసత్యాలను అంగీకరిస్తుంది.

3. విశ్వాసంతో ఏమి నమ్ముతాం? వేదసత్యాలను నమ్ముతాం. అవి సంగ్రహంగా ఇవి. దేవుడు ఒక్కడే. కాని అతడు త్రీత్వంగా వుంటాడు. అతనిలో పిత సుతుడు పరిశుద్ధాత్మ అని ముగ్గురు వ్యక్తులున్నారు. ఈ దేవుడే లోకాన్ని సృజించినవాడు. త్రీత్వంలోని సుతుడైన సర్వేశ్వరుడు నరావతారమెత్తాడు. సిలువమీద చనిపోయి ఉత్థానమై మనలను రక్షించాడు. ఇప్పడు మనం క్రీస్తుని విశ్వసించి పాపపరిహారం పొందుతాం, లోకాంతంలో సంభావనా దండనావున్నాయి. దేవుడు పుణ్యాత్ములకు మోక్షాన్ని దయచేస్తాడు. పాపాత్ములకు నరకశిక్ష విధిస్తాడు. ఈ సత్యాలన్నీ పరలోకంలో నెరవేరడం మనం ఓ దినం చూస్తాం. వీటినే ఈ లోకంలో విశ్వసిస్తాం. వీటినే దివ్యశ్రుతి, లేక దైవావిష్కరణం, లేక దేవుడు తెలియజేసిన సత్యాలు అంటాం. ఇవన్నీ బైబుల్లోను, పారంపర్య బోధలోను మనకు తగులుతాయి. నేడు తిరుసభ ఈ సత్యాలనే మనకు బోధిస్తుంది. నేడు మనం నమ్మేది వీటినే

4. కాని దేవుని మాటలను మనం ఎందుకు నమ్మాలి? రోజువారి జీవితంలో ఓ పెద్దమనిషి లేక సత్యసంధుడు చెప్పిన మాటలను వింటాం. ఎందుకంటే అతడు అబద్ధం