పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౩. ప్రవక్తల ప్రబోధాలు

కనాను దేశంలో స్థిరపడ్డాక యూదులు ఎన్నో ప్రలోభాలకు గురయ్యారు. వాళ్ళ ప్రధాన ప్రలోభం విగ్రహారాధనం. ఆ రోజుల్లో యూదుల చుట్టపట్ల వున్న ప్రజలంతా బాలుని కొల్చేవాళ్లు, యూదులుకూడా మాటిమాటికి ఈ దేవుణ్ణి ఆరాధించి పాపం కట్టుకొనేవాళ్ళ వాళ్ళను హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలను పంపాడు. ఆ దైవ భక్తులు ప్రజల విగ్రహారాధనను ఖండించేవాళ్ల వాళ్ళను చీవాట్లపెట్టి మల్లా దేవుని దగ్గరికి రాబడుతుండేవాళ్ళు.

యెషయా ప్రజలకు శ్రద్ధను బోధించిన మహా ప్రవక్త, అతడు దేవుణ్ణి నమ్మి నెమ్మదిగా వుండడంలోనే మీ బలం ఇమిడి వుందని ఆనాటి ప్రజలను హెచ్చరించాడు - 30, 15. దేవుని పలుకులు నమ్మకపోతే నీ వసలు నిలువనే నిలువని అహాసు రాజుని మందలించాడు - 7, 9. హిజ్కియా రాజు కాలంలో అస్పిరియా రాజు సనెర్రీబు యెరూషలేము మీదికి దాడి చేసాడు. ఐనా దేవుణ్ణి నమ్మి నిమ్మళంగా వుండమని ప్రవక్త రాజని హెచ్చరించాడు. తర్వాత సనెర్రీబు ముట్టడిని ఆపి స్వీయ దేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది - 2 రాజు 19.

క్రీస్తుపూర్వం 587లో బాబిలోనియా రాజు నెబుకద్నెసరు యూదులను జయించి వారి నగరాన్నీ దేవళాన్నీ నాశం జేసాడు. వారిని బాబిలోనియాకు బందీలనుగా తీసికొని పోయాడు. ఆ దేశంలో యూదులు తీరని నిరాశకీ నిరుత్సాహానికీ గురయ్యారు. భక్తివిశ్వాసాలు కోల్పోయి యావే కంటెగూడ బాబిలోనియుల దేవళ్లే గొప్పవాళ్ళని యెంచారు. ఈ కాలంలో గూడ ప్రవక్తలు యిస్రాయేలీయులను హెచ్చరించి ప్రోత్సహించారు. మీరు యావేను నమ్మండి. ప్రవాసం శీఘమే ముగుస్తుందని ఓదార్చారు.

యిస్రాయేలూనా సంగతి ప్రభువుకి తెలియదు
నాకు జరిగిన అన్యాయాన్ని దేవుడు గుర్తించలేదు
అని నీవు ఫిర్యాదు చేస్తావా?
అతడు అలసిపోయినవారికి శక్తి నొసగుతాడు
దుర్భలులకు బలాన్ని దయచేస్తాడు.
యువకులు అలసిసాలసిపోతారు
లేబ్రాయంవాళ్లు పడిపోతారు
కాని ప్రభుని నమ్మినవాళ్ల నూత్న బలాన్ని పొందుతారు
వాళ్ళ పక్షిరాజులా రెక్కలుచాచి పైకెగురుతారు.
అలసట లేక పరుగెత్తుతారు
బడలిక లేక నడక సాగిస్తారు - యెష 40, 27-31.