పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. విధేయత

42. గ్రెగొరీ భక్తుడు చెప్పినట్లు, మనం మన పెద్దలకు విధేయులమైతే దేవుడు మన ప్రార్థనలకు విధేయుడౌతాడు.

43. మనం పెద్దలకు విధేయులమైనప్పడు వాళ్లే మనలను పుణ్యమార్గంలో నడిపించుకొని పోతారు. పని చేస్తున్నా విశ్రాంతి పొందుతున్నా విధేయులైనవాళ్ళ జీవితం పుణ్యవంతమౌతూనే వుంటుంది. ఓడలోపోయే వాళ్ళు నిద్రపోతున్నా ముందుకు సాగిపోతుంటారు కదా!

44. విధేయతలో మూడుమెట్ల ఉంటాయి. మొదటిది, పెద్దలు చెప్పిన పనిని మాత్రమే చేయడం. కాని బానిసలు కూడ యజమానులు చెప్పిన పనిని చేస్తారు. కనుక ఇది శ్రేష్టమైన మెట్టుకాదు. రెండవది, పెద్దలు చెప్పిన పని ఇష్టంతో చేయడం. వేదగ్రంథం "బలిని సమర్పించడం కంటె విధేయత మెరుగు" అని చెప్తుంది. ఎందుకంటే బలిలో పశువులను అర్పిస్తాం. విధేయతలో మన చిత్తాన్నే అర్పిస్తాం. ఇది మొదటి మెట్టకంటె మెరుగైంది. మూడవది, పెద్దలు చెప్పిన పనిని ఇష్టపూర్తిగా చేయడం మాత్రమేకాక, వాళ్ళ చేసిన నిర్ణయాన్నిగూడ అంగీకరించడం. అనగా వాళ్ళ నిర్ణయం మంచిదేనని అంగీకరించి వాళ్ళ చెప్పినపని చేయడం, ఇది శ్రేష్టమైన విధేయత.

45. దేహం క్షేమంగా వుండాలంటే శిరస్సు ఇతర అవయవాలు కలసి పని చేయాలి. అవయవాలు తల ఆజ్ఞలను నెరవేర్చాలి కాని తల అవయవాల ఆజ్ఞలను నెరవేర్చకూడదు. అలాగే పిన్నలు పెద్దల శాసనాలను పాటించాలే కాని పెద్దలు పిన్నల శాసనాలను పాటించకూడదు.

46. మనం మన పెద్దల్లో పొరపాట్లకూ బలహీనతలకూ గురయ్యే సామాన్యమానవులను చూడకూడదు. వారిలో క్రీస్తుని చూడాలి. ఆ ప్రభువు మహాజ్ఞాని, అనంతమైన సదుణాలు కలవాడు, ప్రేమమూర్తి అతడు మనలను మోసగించడు, మన మోసానికిలొంగడు. మన పెద్దల్లో వుండి మనలను ఒడ్డజేరుస్తాడు.

47. విధేయత ప్రతాన్ని చేపట్టి మఠజీవితం గడిపే వ్యక్తి ఓ శవంలా వుండాలి. దానికి సొంత చిత్తమూ అభిప్రాయాలూ వుండవు. అతడు ఓ ప్రతిమలా వుండాలి. దాన్ని ఎటు తిప్పినా అది కాదనదు. ఇంకా అతడు ముసలివాని చేతిలోని ఊతకర్రలా వుండాలి. అతడు దాన్ని తన యిష్టరవచ్చినట్లు వాడుకొంటాడు, వాడుకొన్నంక ఎక్కడైనా పెడతాడు. ఈలాగే విధేయులైనవాళ్లు పెద్దలు తమ్ము ఏలా వినియోగించుకొన్నా అడ్డజెప్పకూడదు.