పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36. ఓసారి ఇగ్నేష్యస్ లయిూనెస్ కలసి ప్రయాణం చేస్తున్నారు. గొర్రెలను గాచుకొనే పల్లెటూరి పిల్లవాడొకడు వాళ్ళను చూచాడు. ఇగేష్యస్ వాలకమూ పేదదుస్తులూ అతనికి వింతగొల్పాయి. అతడు ఇగ్నేష్యస్ని చూచి పగలబడి నవ్వాడు. ఛలోక్తులు విసురుతూ అతన్ని ఎగతాళి చేసాడు, ఇగ్నేప్యస్ ఆ పిల్లవాడికి ఎదురుగా నిలబడి వాడు తన్నింకా అధికంగా గేలి చేసేలా • ప్రోత్సహించాడు. లయోనెస్ ఈ మొరటువాడితో మనకెందుకు; త్వరగా వెళ్ళిపోదాం రా అన్నాడు. కాని ఇగ్నేష్యస్ నెమ్మదిగా "ఈ పిల్లవాణ్ణి తనకిష్టమొచ్చినట్లుగా నవ్వుకొనియి. వీడికి ఎప్పుడో అరుదుగా లభించే ఈ కొద్దిపాటి ఆనందాన్ని మనం చెడగొట్టకూడదు" అన్నాడు.

37. రోములోని యేసుసభ భవనంలో వసించే సభ్యులు తన్ను మెచ్చుకొన్నా పొగడినా గూడ ఇగ్నేష్యస్ బాధపడేవాడు. నన్ను పొగడేవాళ్ళ నన్నుకొరడాతో మోదినట్లే అనేవాడు. ఈ యింటిలోనివాళ్ళు ఇంత పుణ్యవంతమైన జీవితం గడుపుతూంటే నేను వాళ్ళకు దురూదర్శం చూపుతూన్నాను. నా సోదరుల్లో ప్రతి వొక్కరికి నాకులేని సదుణాలున్నాయి. వాళ్ళను చూస్తుంటే నాకు సిగ్గువేస్తుంది అని పల్మేవాడు.

38. జీవితంలో విజయాన్ని సాధించాలంటే మొదట చిన్న కార్యాలతో మొదలుపెట్ట. అప్పడు దేవుడు నీకు పెద్దకార్యాన్నిచేయడానికి సహాయం దయచేస్తాడు. అతడు ఎప్పడు కూడ గర్వాత్ములను కాదని వినయాత్మలకు తన వరప్రసాదాన్ని దయచేస్తాడు.

5. పేదరికం

39. సంపదలు మన ఆధీనంలో వుండాలి. మనం వాటి అధీనంలో వండకూడదు.

6. బ్రహ్మచర్యం

40. మన ఇంద్రియాలు, విశేషంగా కండ్లు, చెవులు, దేహానికి ద్వారాల్లాంటివి. మనం వీటిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి.

41. పరలింగ వ్యక్తులతో మెలిగేప్పడు ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఈ సందర్భంలో మనం ఏ పాపం చేయకపోయినా చెడ్డపేరు తెచ్చుకొనే ప్రమాదముంది. నిప్పవల్ల గాకపోయినా దాని పొగవల్ల మసిబారి పోతాంగదా!