పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30. ఇగేష్యస్ చివరి రోజుల్లో వృద్ధాప్యం వలన యేసుసభ పరిపాలనాభారాన్ని వదలివేసాడు. వ్యాధిగ్రస్తులను పరామర్శించడం ఒక్కటే అతడు అట్టిపెట్టుకొన్న పని. అతడు ఆ ప్రాయంలోగూడ రోగుల్ని రోజూ చాలసార్లు సందర్శించేవాడు, వైద్యుడు వాళ్ళకు ఈయమన్న మందులూ ఆహారపదార్థాలూ వాళ్ళకు సకాలంలో అందేలా చూచేవాడు. వారిపట్ల ఎంతో ఆసక్తి మెలకువా చూపేవాడు.

31. అతడు ఈలా చెప్పేవాడు. సజ్జనులు ఆరోగ్యంగా వుండలని దుష్టులు రోగాలవాత పదాలనీ నా కోరిక. సజ్జనులు ఆరోగ్యంగా వుంటే తమ శక్తిసామర్థ్యాలన్నీ దేవుని సేవకు వినియోగిస్తారు. దుషులు రోగగ్రస్తులైతే బుద్ధితెచ్చుకొని దేవుని దగ్గరికి తిరిగివస్తారు.

32. దేవుని ద్రాక్షతోటలో శ్రమజేసేవాడు బంగారంతోగాక మురికితో పనిచేయాలి. అతడు కుష్ఠరోగులకు సేవలు చేయబోతున్నాడు. అందుచేత వాళ్ళకుష్ట తనకుగూడ సోకకుండా వుండేలా చూచుకోవాలి.

4. వినయం

33. అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. "గర్వితుడు తన్నుతాను గాఢంగా ప్రేమించుకొని దేవుణ్ణి అసహ్యించుకొంటాడు. వినయవంతుడు తన్నుతాను అసహ్యించుకొని దేవుణ్ణి ప్రేమిస్తాడు". ఈ వాక్యంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

34. "నీకు రెక్కలు వచ్చిందాకా ఎగరవద్దు". ఒకసారి యేసుసభకు చెందిన సభ్యుడొకడు తన సొంత సలహాలతోనే ఇతరులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం మొదలెట్టాడు. కాని అతడు తన అజ్ఞానంవల్ల చాలమందిని తప్ప త్రోవ పట్టించాడు. ఈ సంగతి తెలిసి ఇగ్నేష్యస్ అతనికి కఠినమైన శిక్ష విధించాడు. అతన్ని రెండు భుజాలకు రెండు రెక్కలు కట్టుకొని యేసుసభ భవనంలోని సభ్యుల యెదుటికి రమ్మన్నాడు. "నీకు రెక్కలు వచ్చిందాకా ఎగరవద్దు" అంటూ మరోసభ్యుడు అతన్ని అందరి యెదుట మందలించేలా చేసాడు. అనాటినుండి పైవాక్యం యేసు సభలో సామెతగా మారిపోయింది.

35. ఓ యేసుసభ గురువు అయ్యా! శీఘ్రంగా వినయాన్ని అలవర్చుకొనే మార్గమేమిటి అని ప్రశ్నింపగా ఇగ్నేష్యస్ ఈలా చెప్పాడు. మనం లోకంలోని జనం ప్రవర్తించేదానికి కేవలం భిన్నంగా ప్రవర్తించాలి. లోకంలోని ప్రజలు అసహ్యించుకొనేదాన్ని మనం ఆశతో కోరుకోవాలి. వాళ్ళ ఆశతో కోరుకొనేదాన్ని మనం అసహ్యించుకోవాలి.

125