పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్పిదాలను అనవసరంగా ఇంకొకరికి తెలియజేసానుకదా అని బాధపడ్డాడు. శీఘమే ఆత్మగురువు దగ్గరికివెళ్ళి పాపసంకీర్తనం చేసికొన్నాడు.

23. మనం చెప్పేదే ఒప్పయినా యితరులు చెప్పేది మాత్రం తప్పనకూడదు. ఎప్పుడుకూడ మనం యితరుల అభిప్రాయాన్ని గౌరవించాలి

.

24. కొన్నిసార్లు మనం దేవుణ్ణి దేవునికే వదలివేసి అతన్ని తోడి నరుల్లో పరామర్శించాలి. అతనికి చేయగోరిన సేవలు తోడివారికి చేయాలి. నాకు కావలసింది కరుణ కాని బలి కాదు అన్నాడు ప్రభువు

.

25. మనం చేసే కార్యాలను దేవుడు మాత్రమేకాక దేవదూతలూ నరులూ కూడ చూస్తారు. కనుక మనం దేవుని యెదుట మాత్రమేకాక నరుల యెదుటకూడ ఒప్పేగాని తప్పచేయకూడదు. మన క్రియల్లో మనం మొదట దేవుని అంగీకారాన్ని పొందాలి. అటుతర్వాత నరుల అంగీకారాన్నిగూడ పొందాలి. ఎవరుకూడ మన కార్యాల్లో తప్పలు పట్టనట్లుగా నడచుకోవాలి. అప్పడుగాని మన సేవలు యితరులకు ఉపయోగపడవు.

26. మన మనస్సును దేవునిమీద నిల్పివుంచుకొంటూనే యితరులకు పరిచర్య చేయవచ్చు. దైవసాన్నిధ్యాన్ని నిరంతరం గుర్తుంచుకొంటూ ఆ ప్రభువుని అన్నితావుల్లోను అన్ని పనుల్లోను దర్శించవచ్చు. ప్రేమించవచ్చు. ఇతరులకు పరిచర్య చేసేపుడు మనం దేవదూతలను అనుకరించాలి. వాళ్ల స్వర్గాన్ని వదలిపెట్టి లోకంలోని నరులకు సేవలు చేయడానికి వచ్చినపుడు ఆ స్వర్గంలోని దేవుణ్ణి మరచిపోరు. ఈ లోకంలో మనకు సేవలు చేసేపుడుగూడ వాళ్లు దేవుని దివ్యముఖాన్ని దర్శిస్తూనే వుంటారు, అతన్ని ప్రేమిస్తూనే వుంటారు,

27. మనం తోడి నరులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వాళ్ళను దేవుని దగ్గరికి తీసికొని రావాలి. మనతరపున మనం ఎప్పడుకూడ ఇతరులకు అనుకూలంగా ప్రవర్తించాలి. మనం యితరుల అభిరుచులనూ కోరికలనూ అంగీకరిస్తే వాళ్లు సులువుగా మనకు స్నేహితులౌతారు. అటుపిమ్మట వాళ్ళను క్రమేణ దేవుని దగ్గరికి రాబట్టవచ్చు

28. ఇతరులతో మెలిగేప్పడు మనమే వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించాలి. వాళ్ళే మనకు అనుకూలంగా ప్రవర్తిస్తారు అనుకోగూడదు. మనం అందరిపట్ల ఒద్దికగా ప్రవర్తిస్తే కొందరినైనా క్రీస్తు దగ్గరికి రాబట్టవచ్చు.

29. చిన్నచిన్న బహుమతులద్వారా తినుబండారాల ద్వారా చిన్నపిల్లలచేతగూడ పుణ్యకార్యాలను అభ్యాసం/చేయించవచ్చు నరులు జంతువులు చిన్నవిగా వున్నపుడు వాటికి తిండిపెట్టి వాటిచేత తాము కోరిన పనులెల్ల చేయిస్తూంటారు.