పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన క్యాతలిక్ సంప్రదాయంలో ప్రవక్తను "దీర్ఘదర్శి” అంటాం. దీర్ఘదర్శి అంటే భవిష్యత్తును తెలియజెప్పేవాడని అర్థం. ప్రవక్తలు ఒకోమారు భవిష్యత్తును గూడ తెలియజేసారు. కాని అది వాళ్ళ ప్రవచనంలో ముఖ్యాంశం కాదు. ముఖ్యమైంది దైవసందేశాన్ని ఎరిగించడం, అంతే కనుక దీర్ఘదర్శి అనేమాట కంటె ప్రవక్త అనే పదం మెరుగైంది.

2. ప్రవక్తల సేవలు

ప్రవక్తలు యిస్రాయేలు సమాజానికి రకరకాల సేవలు చేసారు. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. ప్రభువు ఉద్యమాన్ని నడిపించారు

పూర్వవేదంలో ప్రభువు సీనాయి కొండ దగ్గర యూదులతో ఒడంబడిక చేసికొన్నాడు. మోషేద్వారా వాళ్ళకు ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు. కాని యూదులు మాటిమాటికి ప్రభువుని విస్మరించి ఈ ధర్మశాస్తాన్ని విూరుతుండేవాళ్లు, అలాంటప్పుడు ప్రవక్తలు ప్రజలను చీవాట్ల పెట్టి ఈ ధర్మశాస్తాన్ని పాటించమని హెచ్చరిస్తుండేవాళ్లు, ఉదాహరణకు జనులు ధర్మశాస్తాన్ని విూరి పేదప్రజలను పీడిస్తుండగా ఆమోసు ప్రవక్త
"నీతి ఓ నదిలా పొంగిపారాలి
న్యాయం ఓ జీవనదిలా ప్రవహించాలి"

అని ప్రవచించాడు - 5,24. సాంఘిక న్యాయాన్ని గూర్చి అతడు చేసిన హెచ్చరికల వలన నాటి సమాజంలో కొంత మార్పు వచ్చింది.

అలాగే అగబు ప్రవక్త రోమను సామ్రాజ్యంలో రాబోయే కరువును గూర్చి ముందుగానే హెచ్చరించాడు. ఈ కరువు 49-50 సంవత్సరాల్లో వచ్చింది. పౌలు అతని శిష్యులు ఈ కరవును పరస్కరించుకొని పేదలకు సహాయం చేయడానికి పూనుకొన్నారు. డబ్బును ప్రోగుజేసి యెరూషలేములోని పేదవారికి సహాయంగా పంపారు. ఈ సహాయోద్యమానికి అగబు ప్రవచనమే నాంది — అ చ 11,27-30. ఈలా ప్రవక్తలు ప్రభువు ఉద్యమాలను నడిపించారు.

2. ప్రభువు వాక్యాన్ని విన్పించారు

ప్రవక్త ప్రభువు వార్తావహుడు అన్నాం. కనుక అతడు ప్రభువు వాక్యాన్నిప్రజలకు విన్పిస్తాడు. ఉదాహరణకు హిజియారాజు జబ్బుగా పడివున్నాడు. ప్రభువుయెషయా ప్రవక్త ద్వారా అతడు చనిపోతాడని చెప్పించాడు. ఆ మాటలకు రాజు దిగులుపడి