పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. దైవప్రేమ

6. నరులుగాని దేవదూతలుగాని దేవునికి కీర్తి చేకూర్చి పెట్టడంకంటె గొప్పకార్యమేమీ చేయలేరు. మొదట మన ద్వారాను తర్వాత ఇతరులద్వారాను ప్రభువుకి కీర్తి సిద్ధించేలా చేయాలి.

7. ప్రభూ! నీ ప్రేమను నీ వరప్రసాదాన్నీ నాకు దయచేయి. వీటితో నేను సంపన్నుజ్ఞవుతాను. నాకు ఇంకేమి అక్కరలేదు.

8. స్వర్గంవైపు జూస్తూంటే ఈ లోకం ఎంత నిస్సారమైందా అన్పిస్తుంది.

9. ప్రేమను మాటల్లోగాక చేతల్లో చూపించాలి. మన మాటలు చేతలుగా మారిందాకా వాటికి దేవుని యెదుట ఏ విలువా వుండదు.

10. దేవుణ్ణి ప్రేమించడంకంటె మధురమైన వస్తువేదీ లోకంలో లేదు. ప్రేమకు నిజమైన గురుతేమిటిటంటే, మనం ప్రేమించే వాళ్ళకొరకు బాధలు అనుభవించడం. కనుక దేవుని కొరకు శ్రమలు అనుభవించడం మహానందం అనుకోవాలి. క్రీస్తు కొరకు మనం అనుభవించే శ్రమలే దేవుడు మనకు దయచేసే మహాభాగ్యాలు అని చెప్పాలి.

11. భగవంతుణ్ణి హృదయంలో నిల్పుకొనేవాడు ఎక్కడికి వెళ్ళినా మోక్షాన్ని తనతో తీసికొని పోతాడు.

12. దేవుడు కలవాడికి ఏమీ లేకపోయినా అన్నీ వున్నట్లే. మంచి అంతా ఆ భగవంతుల్లోనేవుంది. కనుక అతన్ని సంపాదించుకొన్నవాడికి అన్నిభాగ్యాలూ లభిస్తాయి.

13. "దేవుణ్ణి అర్థంచేసికొన్న భక్తుడు ఆ ప్రభువుని జ్ఞప్తికి తెచ్చుకోవాలంటే ఆకాశంవైపో చుక్కలవైపో చూడనక్కరలేదు. చిన్నగడ్డిపోచకూడ అతనికి దేవుణ్ణి జ్ఞప్తికి తెస్తుంది". ఈ సూత్రం ప్రకారం ఇగ్నేప్యస్ ఓ చిన్న పూవును చూచినంత మాత్రాన్నో లేక ఓ పక్షికూతను విన్నంత మాత్రాన్నో భగవంతుని ప్రేమతో నిండిపోయేవాడు.

3. సోదరప్రేమ

14. దేవునికి అన్నీ వున్నాయి. మన సేవలు అతనికి అక్కరలేదు. కాని దేవుని ప్రేమకొరకు మనం ఆ సేవలను తోడినరులకు చేయాలి. 15. నరులు ఎంత అయోగ్యులైనా మనం వాళ్ళను ప్రేమించవలసిందే. ఇప్పడు కాకపోయినా పూర్వం వాళ్ళల్లో వున్న విశ్వాసాన్నీ పుణ్యాలనూ చూచి మనం వాళ్ళను ప్రేమించవలసిందే.