పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్లి తలుపు తట్టి పేరెత్తి పిలచి వారిని బయటికి రమ్మన్నాడు. ఐనా ఆ పదకొండు మందిలో ఒక్కడూ త్వరగా బయటికి రాలేదు. కాని సిల్వేనస్ మార్కు తలుపు తట్టగానే అతడు తలుపు తీసి బయటికి వచ్చాడు. వాళ్లంతా మార్కు గదిలోనికి వెళ్లి చూడగా అప్పడు ఆ శిష్యుడు గ్రీకు భాషలోని చివరి అక్షరమైన ఓమెగా వ్రాస్తున్నాడు. కాని సిల్వేనస్ తలుపు తట్టడం వల్ల ఆ యక్షరపరాత సగంలోనే ఆపివేసి వెలుపలికి వచ్చాడు. అప్పుడు సిల్వేనస్ ఇతర మునులను చూచి ఆ పదకొండు మంది యేరీ అని ప్రశ్నించాడు. వారు "అయ్యా! నీవు ఈ మార్కుని అధికంగా ప్రేమించడం సబబే. మేమూ ఇతన్ని ప్రేమిస్తున్నాం. భగవంతుడూ ఇతన్ని ప్రేమిస్తాడు" అని చెప్పారు.

47. విరాయస్ అనే ముని వుండేవాడు. ఓ దినం ఓ సైనికుడు అతని దగ్గరికి వచ్చి అయ్యా! దేవుడు నరుల పశ్చాత్తాపాన్ని నిజంగా అంగీకరిస్తాడా అని అడిగాడు. విూయస్ అతినికి కొన్ని వేదవిషయాలు బోధించి కడన "నీ బట్ట చినిగిపోతే దాన్ని అవతల పారేస్తావా?" అని అడిగాడు. సైనికుడు "ఎందుకు పారవేస్తాను! దాన్ని కుట్టించి మళ్లా వాడుకొంటాను" అని చెప్పాడు. మియస్ "నీ వస్త్రం పట్ల నీకు అంత ఆదర భావమంటే, దేవునికి తాను చేసిన ప్రాణుల పట్ల ఆదరభావముండదా?" అని ప్రశ్నించాడు.

48. ఒకసారి పట్టణాధికారి పోయెమన్ అనే మునిని దర్శింపగోరాడు. కాని ముని అతన్ని చూడ్డానికి ఇష్టపడలేదు. అధికారి ముని మేనల్లడి విూద నేరం మోపి అతన్ని చెరలో పెట్టించాడు. పోయెమన్ వచ్చి అడిగితే అతన్ని విడిపిస్తానని చెప్పాడు. ఆ విధంగానైనా మునిని సందర్శించవచ్చు గదా అని అతని పన్నాగం. అంతట పోమన్ చెల్లెలు వచ్చి అన్న తలుపు తట్టింది గాని అతడేవిూ జవాబీయలేదు. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక అన్నా! నీది మాంసపు గుండా లేక రాతి గుండా? నాకు వాడొకడే కొడుకు అని బోరున యేడ్చింది. కాని పోయెమన్ "నీకు ఒక్కడే కొడుకు కావచ్చు. నాకు ఏ కొడుకూ లేడు” అని జహబిచ్చాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అధికారి పోయెమన్ దగ్గరికి బంటునంపి అయ్యా! నీవు అర్థిస్తే చాలు, నేను నీ మేనల్లుడ్డి చెరనుండి విడిపిస్తాను అని కబురు పంపాడు. కాని ముని ఆ యధికారికి ఈ విధంగా ప్రత్యుత్తరమంపాడు. "నీవు ఖైదీకి న్యాయం తప్పకుండా తీర్పుచెప్ప, అతడు వధ్యుడైతే చంపివేయి. లేకపోతే నీ యిష్టం వచ్చినట్లు చేయి."

49. ఓసారి ఓ సన్యాసి పోయెమన్ మునిని "అయ్యా పొరుగువాడు తప్ప చేయడం చూచి దాన్ని దాచిపెట్టడం ఉచితమేనా అని అడిగాడు. ముని అతనికి "మనం ఇతరుల తప్పలను దాచిపెట్టినపుడెల్లా దేవుడు మన తప్పలు దాచిపెడతాడు. మనం ఇతరుల దోషాలను బట్టబయలు చేసినపుడెల్లా దేవుడు మన దోషాలను వెల్లడిచేస్తాడు" అని జవాబు చెప్పాడు.