పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంపి "నీవు తప్పక రావాలి. ఇక్కడివాళ్లంతా నీ కొరకు ఎదురుచూస్తున్నారు" అని చెప్పించాడు. మోషే ముని ఓ ఓటి కూజాను నీటితో నింపుకొని ఆ యాశ్రమానికి వెళ్లాడు. దారిపొడుగునా నీళ్ల బొట్లుబొట్లుగా కారుతున్నాయి. అక్కడి తాపసులంతా అతనికి స్వాగతం పలికి అయ్యా నీవు ఆ వోటి కూజాను తీసికొని రావడంలో భావమేమిటి అని అడిగారు, మోషే ముని "నా తప్పలు నా వెనుక బొట్లబొట్లగా కారుతూన్నా నేను గమనించడం లేదు. ఐనా తగుదునయ్యా అని ఈ దినం ప్రక్కవాడి తప్పలు ఎన్నడానికి ఇక్కడికి వచ్చాను" అన్నాడు. ఆ మాటలు విని అక్కడి సన్యాసులంతా తప్ప చేసిన ఆ తాపసిని క్షమించి వదలివేసారు.

44. పట్టణాధికారి" మోషేమని పుణ్యకార్యాలను గూర్చి విని అతన్ని సందర్శించడానికి వెళ్లాడు, కాని అధికారి వస్తున్నాడని మోషేకు ముందుగానే తెలిసింది. కనుక అతడు తన నివాసాన్ని వీడి సముద్రం వైపుగా పారిపోవడం మొదలెట్టాడు. దారిలో అధికారి అతన్ని కలసికొన్నాడు. కాని అతడే మోషే అని గుర్తించలేక అధికారి అయ్యా! ఈ ప్రాంతంలో మోషే అనే మహాత్ముడు వసిస్తున్నాడని విన్నాను. అతని నివాసం ఎక్కడ వుందో నీకు తెలుసా అని అడిగాడు, ఆ మాటలకు మోషేముని "నీవు ఆ మూరుణ్ణి చూడ్డానికి యింత దూరం వచ్చావా?" అన్నాడు. అధికారి మోషేను గూర్చి పూర్వం తాను విన్నవార్తలు నిజం కాదేమోనని శంకించి నిరాశతో పట్టణానికి తిరిగిపోయి అక్కడి గురువులకు జరిగిన సంగతి చెప్పాడు. ఆ గురువులు నీకు కన్పించిన వ్యక్తి ఆకారం ఏలా వుందని అడగ్గా అధికారి "అతడు వృద్ధుడు. చింపిరి గుడ్డలు తొడుక్కొని నల్లగా పొడుగ్గా వున్నాడు" అని చెప్పాడు. గురువులు అయ్యా! అతడే మోషేముని, నిన్ను తప్పించుకోడానికే అతడాలా మాట్లాడాడు అని చెప్పారు. అధికారి మోషే వినయాన్ని మెచ్చుకొంటూ వెళ్లిపోయాడు.

45. మాటోవ్ అనే ముని ఈలా నుడివాడు. "నరుడు దేవుణ్ణి సమిపించేకొద్దీ తన పాపాలను అధికాధికంగా గుర్తిస్తాడు. కావననే యెషయా ప్రవక్త దేవుణ్ణి దర్శించగానే "నానోటి నుండి వెలువడేవన్నీ పాపపు మాటలే" అనుకొని భయపడ్డాడు.

46. పేటిష్ ఎడారిలో వసించే సిల్వేనస్ మునికి 12 మంది శిష్యులుండేవాళ్ళ వీళ్ళల్లో మార్కు అంటే ఆ మునికి ఎక్కువ యిష్టం. మార్కు లిఖిత ప్రతులను వ్రాసే వ్రాయసకాడు. సిల్వేనస్ మార్మును అధికంగా ప్రేమించడం సహించలేక తతిమ్మా 11 మంది శిష్యులు ఆ ప్రక్కనే వున్న ఆశ్రమంలోని తాపసులకు ఫిర్యాదు చేసారు. సన్యాసులంతా ఓ దినం సీల్వేనస్తో మాట్లాడ్డానికి అతని ఆశ్రమానికి వచ్చారు. సిల్వేనస్ వారి ఫిర్యాదు విన్నాడు. అతడు వారందరినీ వెంటబెట్టుకొని ఒక్కో శిష్యుని గది దగ్గరికి