పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరువు తీసికొని ఓ తాపసి బాకీ తీరుద్దామనుకొన్నాను. ఇంతలో దారిలో ఇది కన్పించింది. ఇది నాదని అడిగినవాళ్ళెవరూ లేరు కనుక నేను దీన్ని ఆ తాపసికిచ్చి అప్ప తీర్చుకొంటాను అన్నాడు. బాకీ వండికూడ అతడు దారిలో కన్పించిన బంగారు నాణాన్ని ముట్టుకోనందుకు యాకోబు తాపసి చాల విస్తుపోయాడు.

38. ఓసారి ఈసాకు అనే ముని ఓ ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఓ తాపసి తప్ప చేస్తూండగా చూచి అతన్ని ఖండించాడు. అతడు తన నివాసానికి తిరిగి వచ్చాక ఓ దేవదూత తలుపుకి అడ్డంగా నిల్చుండి నేను నిన్నులోనికి పోనీయను అన్నాడు. ఎందుకని అడగ్గా "నీవు ఖండించి వచ్చిన ఆ సన్యాసిని ఎక్కడ త్రోద్దామనుకొన్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు" అని చెప్పాడు. ఈసాకు తన తప్పను గురు తెచ్చుకొని పశ్చాత్తాపపడ్డాడు, దేవదూత "దేవుడు ఇప్పటికి నీ దోషాన్ని మన్నించాడు. ఇకవిూద దేవుడు తీర్పు విధించకపూర్వమే నీవెవరికీ తీర్పు తీర్చవద్దు" అని చెప్పాడు.

39. కాష్యన్ అనే ముని ఈ వదంతం తెలియజేసాడు. ఓ వృద్ధ సన్యాసి వుండేవాడు. ఒక పవిత్రురాలైన కన్య అతనికి పరిచర్య చేస్తూండేది. ఇరుగుపొరుగు వారు స్త్రీతో సేవలు చేయించుకొనేవాడు పవిత్రుడేనా అని శంకించి అతన్ని గూర్చి పరిపరి విధాల మాట్లాడ్డం మొదలెట్టారు. అంతట ఆ వృద్ద సన్యాసి చనిపోతూ నా కర్రను నా సమాధిపై పాతి వుంచండి అని చెప్పాడు. అలాగే పాతివుంచగా అది మూడవనాడు చిగిర్చి పూలు పూచి కాయలు కాచింది. అప్పుడు ఇరుగుపొరుగు సన్యాసులు అతడు నిజంగా దైవభక్తుడేనని నమ్మారు.

40. ఒక మహిళ క్యాన్సర్తో బాధపడుతూ స్వస్థత చేకూర్చేవరం గల లొంజీనస్ అనే మునిని చూడగోరింది. అతడు అలెగ్జాండ్రియా పట్టణానికి తొమ్మిదిమైళ్ళ దూరంలో ఎడారిలో వసించేవాడు. ఆ భక్తురాలు లొంజీనస్ కోసం వెదుకుతూండగా అతడు పల్ల లేరుకొంటూ సముద్రపు బొడ్డున కన్పించాడు. కాని అతడు లొంజీనస్ అని ఆమెకు తెలియదు. కనుక ఆమె అయ్యా దైవభక్తుడైన లొంజీనస్ నివాసమెక్కడో నీకు తెలుసా అని అడిగింది. అతడు నీవు ఆ మోసగాని కొరకు ఎందుకు వెతుకుతున్నావు? అతడు వట్టి మాయావి. అసలు నీ బాధయేమిటో చెప్ప" అన్నాడు. ఆమె తన రొమ్ము విూది గాయాన్ని చూపించగా అతడు దానిమిూద సిలువ గుర్తువేసి "తల్లీ! ఇక వెళ్లు, దేవుడు నీకు ఆరోగ్యం దయచేస్తాడు. ఎవరో లొంజీనస్ అంటున్నావే, అతడు నీకేలాంటి సాయమూ చేయలేడు సుమా" అని చెప్పాడు. ఆ మహిళ అతని మాటలు నమ్మి తిరుగు ముఖం పట్టగా దారిలోనే క్యాన్సరు,వ్యాధి నయమైంది. తర్వాత, ఆమె ఆ వదంతాన్ని తోడివారికి తెలియజేసి తన రోగాన్ని నయంజేసిన నరుని రూపురేఖలను వివరించి చెప్పింది. జనులు అతడే లొంజీనస్ భక్తుడు అని చెప్పగా ఆమె నివ్వెరపోయింది.