పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34. యాకోబు యతి ఈలా వాకొన్నాడు. "దీపం చీకటి గదిని కాంతిమంతం చేస్తుంది. అలాగే దైవభీతి నరుని హృదయంలోనికి ప్రవేశించి దాన్ని తేజోవంతం చేస్తుంది. అది నరునికి సకల పుణ్యాలూ దైవాజ్ఞలూ బోధిస్తుంది.

35. ఈ మునే యిలా చెప్పాడు, "మనకు కావలసింది చేతలు కాని మాటలు కాదు. నేటి ప్రపంచంలో చేతల కంటె మాటలు ఎక్కువ అయ్యాయి. కాని వట్టి మాటల వల్ల ప్రయోజనం లేదు".

36. ఒక దయ్యం పట్టిన పిల్లవాణ్ణి స్వస్థత చేకూర్చడానికి ఆశ్రమానికి తీసుకవచ్చారు. అంతలోనే ఈజిప్టు నుండి కొందరు సన్యాసులు రాగా పర్యన్ జాన్ అనే ఆశ్రమంలోని వృద్ధమని వారికి స్వాగతం చెప్పడానికి వెలుపలికి వస్తున్నాడు. అలా వస్తూ అతడు ఆశ్రమంలోని ఓ సన్యాసి ఆ బాలునితో పాపం చేస్తూండడం చూచాడు. ఐనా ముని ఆ సన్యాసిని ఏవిూ అనలేదు. అతడు అన్నీ గమనించే దేవుడు ఆ సన్యాసి తప్ప చూచికూడ అతన్ని భస్మం చేయునపుడు నేను మాత్రం అతన్నెందుకు నిందించాలి అనుకొన్నాడు.

37. ఈ పర్యన్ జాన్ అనే ముని ఈజిప్టులో వసించేవాడు. అతడు సోదర ప్రేమకు పెట్టింది పేరు. ఓ దినం అతడు తనతో పాటు వసిస్తూన్న ఓ సన్యాసి నుండి డబ్బు బాకీ తీసికొని బట్ట నేసికోవడానికి నూలు కొనుక్కొని వచ్చాడు. అతడు వస్త్రం నేసికోబోతూండగా ఇంకో ముని వచ్చి తనకు కొంచెం నూలీయమని అడిగాడు. జాన్మని అలాగే యిచ్చాడు. అలాగే ఇతర యతులు కూడ వచ్చి అతని నూలంతా అడిగి తీసికొనిపోయారు. ఇంతలో అతనికి సొమ్మిచ్చిన సన్యాసి వచ్చినా బాకీ తీర్చమని అడిగాడు. అతడు అరువు తెచ్చి బాకీ తీర్చడానికి గాను ఆ ప్రక్కనే వసిస్తూన్నయాకోబు అనే మరో తాపసి నివాసానికి బయలు దేరాడు. దారిలో అతనికి ఓ బంగారు నాణెం కన్పించింది. ఐనా జాన్ దాన్ని ముట్టలేదు. దాని విూద ప్రార్ధనం చేసి తన నివాసానికి తిరిగివచ్చాడు. బాకీ యిచ్చిన సన్యాసి మళ్ళా వచ్చి తన సొమ్ము తిరిగి యిచ్చివేయమని పీడించాడు. జాన్ ముని తిరిగి యాకోబినే తాపసి దగ్గరికి ప్రయాణం కట్టాడు. దారిలో మళ్ళా బంగారు నాణెం కన్పించింది. అతడు దాన్ని ముట్టకుండా దానిపై ఓ ప్రార్థన చెప్పి తిరిగి వచ్చాడు. ఈలా మూడుసార్లు జరిగింది. నాల్గవసారి అతడు యాకోబు తాపసి దగ్గరికి వెళూండగా ఆ నాడెం తిరిగి కన్పించింది. జాన్ ముని దానిపై ప్రార్థన చేసి దాన్ని తీసికొనిపోయి యాకోబుకిచ్చి, ఇది నాకు దారిలో దొరికింది. ఎవరైనా దీన్ని పోగొట్టుకొన్నారేమో ఈ ప్రాంతంలో ప్రకటన వేయించు అని చెప్పాడు. కాని మూడు రోజులు ప్రకటనం వేయించినా ఎవరూ దానికోసం రాలేదు. అప్పుడు జాన్ ముని అయ్యా! నేను నీ దగ్గరికి వచ్చి డబ్బు