పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడికి జీతం లేదా అని ముని అడగ్గా రైతు లేదని జవాబు చెప్పాడు. అంతట యెషయా అక్కడినుండి వెళ్ళిపోయాడు. అతని చర్యనంతటినీ గమనిస్తూన్న శిష్యులు అయ్యా! నీవీలా ప్రవర్తించడంలో భావమేమిటి అని అడిగారు. యెషయా నేను విరాకు ఓ ఆదర్శం చూపించడానికే యాలా చేసాను. శ్రమ చేయనివాడికి దేవుని నుండి బహుమతి లభించదు అని చెప్పాడు.

25. ఏలీయా ముని ఈ వుదంతం తెలియజేసాడు. ఓ వృద్ధ సన్యాసి ఓ పాడుపడిన దేవళంలో వసస్తుండేవాడు. ఓ దినం పిశాచాలు అతని దగ్గరికి వచ్చి ఇది మా యిల్లు. నీవు ఈ తావని వదలి వెళ్ళిపో అని దబాయించాయి. అతడు విూ కసలు ఏతావూ లేదు పొండన్నాడు. అవి రెచ్చిపోయి అతని తాటాకుల గ్రంథంలోని ఆకులను ఊడబెరికి చిందర వందరగా వెదజల్లాయి. సన్యాసి ఓపికతో ఆయాకులన్నిటిని ఏరుకొన్నాడు. అటుపిమ్మట ఓ పిశాచం అతన్ని చేయిపట్టుకొని దేవళం వెలుపలికి లాగబోయింది. కాని సన్యాసి ఓ చేతితో దేవాలయ ద్వారబంధాన్ని గట్టిగా పట్టుకొని "యేసు ప్రభూ! నన్ను కాపాడు" అని మనవి చేసాడు. ఆ ప్రార్థనకు దయ్యాలు పారిపోయాయి. సన్యాసి పిశాచాలు నా కింత పని చేసాయి కదా అనుకొని దుఃఖంతో ఏడ్వడం మొదలెట్టాడు. అప్పడు ప్రభువు ఓయి! నీవు అశ్రద్ధ చేసావు. నీవు నాకు మొరపెట్టగానే నేను నిన్ను కాపాడాను గదా? మొదటనే నీవు నన్నెందుకు ఆశ్రయించలేదు. నేను సిలువపై బాధలనుభవించింది నరుల బాధలు తొలగించడానికి కాదా? నా సహాయాన్ని అడిగేవాణ్ణి నేను వెంటనే ఆదుకోనా? అన్నాడు.

26. తియొడోరా అనే సన్యాసిని ఈలా చెప్పింది. తపస్సు, జాగరణం, కష్టాలు అనుభవించడం మొదలైన పుణ్యకార్యాల ద్వారా గాక వినయం వల్లనే మనకు రక్షణం కలుగుతుంది. వినండి. ఓ సన్యాసి వుండేవాడు. అతడు భూతాలను పారద్రోలగలడు. ఓ దినం అతడు పిశాచాన్ని చూచి నీవనరులు ఉపవాసం చేస్తే పారిపోతాపా అని అడిగాడు. పిశాచం మేము భోజనం ముట్టుకోము అంది. అతడు మీరు నరులు జాగరణంచేస్తే పారిపోతారా అని అడిగాడు. దయ్యం మేము నిద్రపోమంది అతడు మేము ఈ ప్రపంచాన్ని పరిత్యజిస్తే మిరు పారిపోతారా అని ప్రశ్నించాడు. అది మేము లోకంలో గాక ఎడారుల్లో వసిస్తాము అంది. సన్యాసి ఐతే మిూరు ఏ శక్తికి లొంగి పారిపోతారో చెప్ప అన్నాడు. పిశాచం మేము వినయానికి దప్ప మరిదేనికీ లొంగం అంది. చూచారా! దయ్యాన్ని జయించాలంటే వినయానికి మించిని సాధనం లేదు.

27. ఒక భక్తుడు తియోడోరాను అమ్మా! లోకాంతంలో మన శరీరాలు ఉత్థానమౌతాయనడానికి నమ్మక మేమిటి అని అడిగాడు. ఆమె మన క్రీస్తు చనిపోయి ఉత్థానమయ్యాడు కదా! ఆ ప్రభువు వుత్థానం మన వత్థానానికి సూచకం గాను, ఆదర్శంగాను, విశ్వాస కారణంగాను వుంటుంది అని చెప్పింది.