పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని విభాంతి జెందాడు. అంతోనిముని వేటగానికి గుణపాఠం నేర్పాలనుకొన్నాడు. అతనితో నీ విల్ల బాగా వంచి బాణం వేయి అన్నాడు. వేటగాడు అలాగే వేసాడు. ముని అతన్ని రెండవసారి గూడ అలాగే ఆదేశించాడు, వేటగాడు అలాగే చేసాడు. ముని మూడవసారి గూడ అలాగే ఆజ్ఞాపించాడు. కాని వేటగాడు అయ్యా! ఇంతకాలం వంచి వంచితే నా విల్ల చెడిపోతుంది అన్నాడు. అప్పడు ముని "నాయనా! భగవత్సేవ కూడ యింతే. నిరంతరం గాఢభక్తితో జీవిస్తే నరులు జబ్బుపడిపోతారు. జీవితంలో కొంత సుఖమూ ఉల్లాసమూ కూడ వుండాలి" అని చెప్పాడు. ఆ మాటలకు వేటగాడు చాల సంతోషించాడు.

4 అరేనియస్ ముని ఈలా వచించాడు. “మనం భగవంతుణ్ణి వెదకితే అతడు మనకు దర్శనం ఇచ్చితీరతాడు, అతన్ని మనచెంత వుంచుకోగోరితే ఎల్లవేళలా మన దాపలోనే వండిపోతాడు."
5. ఓ సన్యాసి అర్సేనియస్ మునిని అయ్యా! నీవు మాతో కలియవెందుకు అని అడిగాడు. అతడు ఈలా చెప్పాడు. "నాయనా! విూరంటే నాకిష్టమే. కాని నేను దేవునితోను నరులోను కలసి జీవించలేను. దేవదూతలకు ఒకే చిత్తం వుంటుంది. కాని నరులకు చాల చిత్తాలుంటాయి. కనుక నేను నరునితో కలసివుంటూ దేవుణ్ణి వదలుకోలేను".
6. అరేనియస్ ముని కానోపస్ అనే యెడారి ప్రాంతంలో జీవిస్తుండగా రోమనుండి ఓ భక్తరాలు ఆయన్ని దర్శించడానికి వచ్చింది. ఆమె ఉన్నతురాలైన మహిళ, రోము శాసనసభలో సభ్యురాలు కూడ. ఆమె వచ్చేటప్పటికి ముని ఆశ్రమం వెలుపలే వున్నాడు. ఆమె అతని పాదాల విూద వాలి అయ్యా! నన్ను సదా జ్ఞాపక మంచుకోండి అని మనవి చేసింది. అతడు ఆమెను వదలించుకొంటూ "అమ్మా! నీ స్మృతిని నా హృదయం నుండి పూర్తిగా తొలగించమని దేవుణ్ణి వేడుకొంటాను" అన్నాడు.
7. దినం ఓ న్యాయాధిపతి ఓ వీలునామాను తీసికొని అర్సేనియస్ ముని దగ్గరికి వచ్చాడు. అరేనియస్ బంధువూ రోము శాసనసభ సభ్యుడూ ఐన ఓ ధనికుడు తన ఆస్తినంతటినీ అరేనియస్ పరం జేసూ ఆ వీలునామా వ్రాసాడు. ముని ఆ వీలునామాను తీసికొని దాన్నిచింపివేయబోయాడు. కాని న్యాయాధిపతి అయ్యా విూరు దాన్ని చింపివేయవద్దు. అలా చేసారంటే నా తల తెగుతుంది అని మనవి చేసాడు. అందుకు ఆ ముని "ఈ ధనవంతుడు ఇప్పడు చనిపోయాడు. కొని నేను ఇతని కంటె చాల యేండ్లకు ముందే చనిపోయాను” అని పలికాడు.
8. ఓ దినం ఓ సన్యాసి అర్సేనియస్ను చూడ్డానికి వచ్చి తలుపు తట్టాడు. ముని తలుపు తెరచిచూచి మరో సన్యాసి తన్ను దర్శించడానికి వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే అతడు ఆ సన్యాసి ముందు నేలపై బోరగిలపడ్డాడు. సన్యాసి అయ్యా! తమరు