పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాజమాన్యం ఇది మా సంస్థ, ఇక్కడ మేము యజమానులం విూరు పనివాళ్ళ కనుక విూ జీతం విూరు తీసికొని మేము చెప్పిన పనిచేసి వెళ్ళిపొండి అన్నట్లుగా ప్రవర్తించకూడదు. అందరూ కలసి ఒక బృందంగా పనిచేయాలి. వి సంస్థ మనందరిది అన్నట్లుగా తలంచాలి. ఆ సంస్థను గూర్చి ఏవైన నిర్ణయాలు చేసేప్పడు యాజమాన్యం గృహస్థ ఉపాధ్యాయుల ప్రతినిధులను కూడ పిల్వాలి. గృహస్థల సర్వీస్ కండిషన్ల ఖచ్చితంగా నిర్ణయించాలి. వాళ్ల జీతాలు సరిగా చెల్లించాలి. వాళ్ల ఫిర్యాదులను ఓపికతో విని న్యాయదృష్టితో పరిష్కరించాలి. ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సదస్సులు మొదలైనవి ఏర్పాటుచేయాలి.

గృహస్థ ఉపాధ్యాయులు కూడ విద్యాసంస్థ తమదే అనుకొని ఉత్సాహంతో కృషిచేయాలి. వాళ్ళ ఆ విద్యాసంస్థ నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ఇంకా పెంచాలే గాని వాటిని దిగజార్చగూడదు. ఆ సంస్థ మంచి పేరును నిలబెట్టాలేగాని చెడగొట్టకూడదు. సంస్థ ఉన్నతాశయాలనూ లక్ష్యాలనూ అర్థం చేసికొని వాటిని సాధించడానికి కృషి చేయాలనేగాని సోమరితనంతో కాలం వెళ్ళబుచ్చకూడదు. గృహస్థలకు కూడ బాధ్యత ఒప్పజెప్లే తమ పలుకుబడి తగ్గిపోతుందేమోనని యాజమాన్యం తలంచగూడదు, ఓమారు అధికారాన్ని చేజిక్కించుకొంటే సేవ చేయకుండానే లాభం పొందవచ్చునని గృహస్థలు తలంచగూడదు.

ఈ వుదాహరణంలో చెప్పిన సూత్రాలనే కొద్ది మార్పులతో ఇతర కార్యరంగాలకు గూడ వర్తింపజేయవచ్చు.