పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండేవని నుడివాం. రెండవ వాటికన్ మహాసభ ఈ భావాలను మళ్ళా ప్రచారంలోకి తెచ్చిందని వాకొన్నాం, దైవప్రజలంతా సరిసమానమే, అందరూ తిరుసభ వ్యాప్తికి కృషి చేయాలి అనేవి క్రొత్త పద్ధతులు.

ఐనా మనదేశంలో ఇటీవలి వరకు ప్రాత పద్ధతులే అమలులో వున్నాయి. విచారణల్లో గురువులు గృహస్థలకు అట్టే ప్రాముఖ్య విూయరు. అలాగే విద్యాలయాలు, ఆస్పత్రులు, సాంఘికసేవా నిలయాలు మొదలైన సేవా సంస్థల్లో పనిచేసే గృహస్థలకు కూడ అట్టే ప్రాముఖ్యముండదు, మన క్యాతలిక్ సమాజంలో పరిపాలనా వ్యవహారాలన్నీ గురువులూ బిషప్పలూ నిర్వహిస్తుంటారు, ఇంకా వేదబోధ మొదలైన పనులు కూడ గురువులే చూచుకొంటూంటారు. గృహస్థలు ఈ రంగంలో అట్టేవత్సాహం చూపించరు. కాని పరిపాలనా వ్యవహారాల్లో గాని, సంస్థలను నడిపించడంలో గాని, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలోగాని, వేదబోధ చేయడంలో గాని గురువులూ గృహస్థలూ అందరూ కలసి పనిచేయడం అవసరం. ఈ కార్యం సిద్ధించనంత వరకూ మన దేశంలో యథార్థమైన తిరుసభ నెలకొనలేదనే చెప్పాలి.


2. కాని యిప్పడిప్పడు భారతదేశ తిరుసభలో కూడ నూత్నాలోచనలు కన్పిస్తున్నాయి. ప్రాతపద్ధతులు పోయి క్రొత్తపద్ధతులు అమలులోకి వస్తున్నాయి. తిరుసభలో గృహస్థలకు కూడ ఉచిత స్థానమియాలి అనే భావాలు ప్రచారం లోకి వస్తున్నాయి. ఈ వినూత్న భావాలకు కారణాలు చాలా వున్నాయి. ఈ దేశంలో మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించి ప్రజాస్వామ్యం ఏర్పరచుకొన్నాం. కనుక తిరుసభలో కూడ ప్రజాస్వామ్యం వుండాలి అనే భావం సహజంగానే తలయెత్తుతుంది. నేడు అందరూ బైబులు జ్ఞానం అలవర్చుకొంటున్నారు. బైబులు దైవప్రజలందరికీ విలువ వుందని చెప్తుంది. ఇంకా నేడు ప్రజలకు జ్ఞానస్నానాన్ని గూర్చిన దైవశాస్తాంశాలూ ఆ సంస్కారం ద్వారా గృహస్థలకు లభించే నాయకత్వమూ కొంతవరకు తెలుసు. గృహస్తులు చాలమంది కతోలిక సేవ మొదలైన ఉద్యమాల్లో పాల్గొని పనిచేస్తుంటారు. ఈ కృషి ద్వారా వాళ్ళకి తిరుసభలో మనస్థాన మేమిటా అనే ఆలోచన పట్టి తీరుతుంది. ఇన్ని కారణాల వల్ల తిరుసభలో గృహస్థలకు కూడ ప్రాముఖ్యముందనే అంశం నేడు చాలమందికి విదితమైంది.
3. తిరుసభలో గృహస్థలకు ఉచిత స్థానం వండాలి, వాళ్ల కూడ నాయకత్వంలో పాలుపొందాలి అని చెప్పాం. కాని ఈ నాయకత్వం పెద్ద బాధ్యతతో కూడింది. స్వార్ణాన్ని చూచుకోక ఇతరులకు సేవ చేయగలిగి వుండాలి అనేది ఈ బాధ్యత ఈలాంటి బాధ్యతను నిర్వహించడానికి మన గృహస్తులు సిద్ధంగా వుండరు. కనుక వాళ్ళను ముందుగా ఈ