పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వీకరించాడు. సిప్రియన్, అగస్టెన్, జెరోము మొదలైన పితృపాదులంతా మొదట గృహస్థలు గానే దైవ శాస్తాన్ని బోధిస్తూ వచ్చారు. అటుపిమ్మట బిషప్పలుగా అభిషిక్తులయ్యారు. బ్రెంటు మహా సభదాకా గూడ ఆయా మహాసభల్లో గృహస్తులు కూడ పాల్గొన్నారు. తొలిరోజుల్లోని వేదసాక్షుల్లో చాలమంది సంసారికులే. ఆనాటి కుటుంబీకులు క్రైస్తవ మతాన్నితమదాన్నిగా భావించేవాళ్ళు. ఆ మతాన్ని అనుసరించడమూ వ్యాప్తిచేయడమూ కూడ తమ బాధ్యత అని యెంచారు. ఈనాడు క్రైస్తవ మతం కొరకు ప్రాణాలర్పించే గృహస్థలు ఎంతమంది వున్నారు? ఆ రోజుల్లో గురువులకీ విశ్వాసులకీ మధ్య ఏలాంటి విభేదాలు వుండేవి కావు, ఆ రెండు తెగలవాళ్ళూ కలసి ఏకవర్గంగా జీవించేవాళ్ళు ఏ విభేదాలు వున్నా క్రైస్తవులకి రోమను మతస్థలకీ మధ్య మాత్రమే వుండేవి.

2. గృహస్థల ప్రాబల్యం పెరగడం

6-7 శతాబ్దాల్లో రాజకీయాలు శ్రీసభలోకి ప్రవేశించాయి. ఈలా ప్రవేశపెట్టింది గ్రెగోరీ పాపుగారు, ఆయన రోమను సామ్రాజ్యాన్ని బలపర్చడానికి రాజకీయాలను ఆశ్రయించాడు. రాజులు రాణులు జమిందారులు మొదలైనవాళ్ల సహాయంతో రోమను సామ్రాజ్యాన్ని క్రైస్తవ మతాన్ని కూడ పటిష్టం చేసి వ్యాప్తి చేయించాడు. కాని ఈ కాలం నుండి రాజకీయ సంస్కృతి అనేది తిరుసభలో భాగమై పోయింది.

ఈ రాజకీయాల ప్రాబల్యం వల్లనే పదవ శతాబ్దానికల్లా తిరుసభలో గృహస్థల ప్రాముఖ్యం బాగా పెరిగిపోయింది. రాజులూ రాణులూ జమిందారులూ తిరుసభలో పెత్తనం చెలాయించారు, షార్ల్మేన్ అనే గొప్పరాజు ఆనాటి పాపగారయిన మూడవ లియో గారి విూదనే అధికారం నెరపినట్లుగా తెలుస్తూంది. "నా సైన్యాలతో తిరుసభనూ రక్షించడమూ వ్యాప్తిచేయడమూ కూడ నా బాధ్యత. మోషేలాగ చేతులెత్తి ప్రార్థన చేసి నా సైన్యాలను గెలిపించడం నీ బాధ్యత" అని యితడు నాటి పాపగారికి జాబు వ్రాసాడు. ఆనాటి రాజులే బిషప్పలనూ మఠశ్రేషులనూ నియమించేవాళ్ళ పాపగారి ఎన్నికలో గూడరాజుల ప్రమేయం ఎంతో ఉండేది. తిరుసభ సొత్తకి ఆశపడి ప్రముఖులైన గృహస్థలు దాని పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం కలిగించుకొనేవాళ్ళు ఈలా గృహసుల ప్రాముఖ్యమనేది 7 నుండి 10వ శతాబ్దం దాకా కొనసాగుతూ వచ్చింది.

3. గృహస్థల ప్రాబల్యం అంతరించడం

11వ శతాబ్దంలో పదవ గ్రెగోరీ పాపుగారు తిరుసభను సంస్కరించారు. రాజులూ రాణులూ జమిూందారులూ తిరుసభ పాలనలో జోక్యం కలిగించుకోవడాన్ని నిషేధించారు.