పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐనా ఒక సంస్థలో పనిచేసే గురువులు లేక మఠకన్యలూ, గృహస్థలూ ఆ సంస్థ శ్రేయస్సు దృష్ట్యా ఉన్నత ప్రమాణాలతో కూడిన లక్ష్యాలను రూపొందించుకోవచ్చు. ఆ లక్ష్యాలను సాధించడానికి అందరూ సమష్టిగా కృషి చేయవచ్చు. ఎవరి వ్యక్తిగతమైన ఉద్దేశాలు వాళ్ళకేవున్నా అందరూ సంస్థ పురోభివృద్ధికి సమష్టిగా పని చేయవచ్చు

3. చారిత్రకంగా గృహస్థల స్థానం

చారిత్రకంగా పరిశీలించి చూస్తే శతాబ్దాల పొడుగునా గృహస్తుల స్థానంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. తిరుసభలో గృహస్తుల చరిత్రను సూలంగా నాలుదశలుగా విభజించవచ్చు.

1. తొలి శతాబ్దాల్లో గురువులూ గృహస్థలూ సరిసమానం

పూర్వవేద ప్రజల్లో యాజకులకూ గృహస్థలకూ మధ్య పెద్ద తేడాయేమి వుండేది కాదు. ఆ వృభయవర్గాల వాళ్ళకు సమానమైన హోదా వుండేది. అలాగే నూత్న వేదారంభంలో కూడ యాజకులకూ సంసారికులకూ పెద్ద వ్యత్యాసమేమిూ కన్పించేది కాదు. క్రీస్తు బోధనా పర్యటనల్లో కొందరు పుణ్యస్త్రీలు కూడ అతని వెంట వెళ్లేవాళ్ల వాళ్ళ క్రీస్తకీ అతని శిష్యులకీ అవసరమైన అన్న పానీయాలు చేకూర్చిపెట్టేవాళ్లు - లూకా 8,2-3. తర్వాత ఈ సంప్రదాయాన్ని పౌలు పేత్రు మొదలైన శిష్యులు కూడ పాటించినట్లు తెలుస్తుంది, 1కొ 9,5.

ఆ తొలిరోజుల్లో ప్రిస్మిల్లా అక్విలా అనే పుణ్యదంపతులు వేదప్రచారంలో ఎంతో తోడ్పడ్డారు. అచ -18,26. సైఫను మరణానంతరం చాలామంది గృహసులు వేదబోధకులుగా వ్యవహరించారు. అచ 11,19-21. పౌలు తనతో గూడి వేదబోధ చేసిన యువొదియా, సుంటకె,క్లెమెంటు అనే గృహస్థలను ఆదర పూర్వకంగా పేర్కొన్నాడు. పిలి – 4,2-3. ఇంచుమించు ఐదవ శతాబ్దం దాకా ఈ సమానత్వం ఈలాగే కొనసాగుతూ వచ్చింది.

తొలి శతాబ్దాల్లో వేదబోధ చేసి తిరుసభను వ్యాప్తి చేసిన వాళ్ళల్లో గృహస్థలు కూడ వున్నారు. ప్రారంభంలో క్రైస్తవ విశ్వాసం విశేషంగా వ్యాపార మార్గాల వెంట పెరుగుతూ వచ్చింది. క్రైస్తవ వ్యాపారులే ఈ రోజుల్లో క్రీస్తుని బోధిస్తూ వచ్చారు. రెండవ శతాబ్దంలో గొప్ప వేదబోధకుడుగా కీర్తి గణించిన జస్టిన్ కుటుంబీకుడు. అలాగే రెండవ శతాబ్దంలో అలెగ్జాండ్రియా పట్టణంలో క్రైస్తవ వేదాంతాన్ని బోధించిన ఓరిజిన్ పండితుడు కూడా చాలా యేండ్లదాక గృహస్థుడుగానే జీవించాడు. జీవితాంతంలో అతడు గురుపట్టాన్ని