పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్యేక బాధ్యత, కనుక ఈ రంగంలో వీళ్ల నాయకత్వం చెల్లుతుంది. ఇందుకు ఆత్మ వీళ్లకు ప్రత్యేక వరాలు కూడ ఇస్తుంది. కాని ఈ దేశంలో, భౌతిక రంగంలో నాయకత్వం వహించే సామర్థ్యం మన గృహస్తులకు ఇంకా తగినంతగా అలవడలేదు. కనుక వీళ్లను తర్ఫీదు ద్వారా ఈ నాయకత్వానికి సిద్ధం చేయాలి. భౌతిక రంగంలో నాయకత్వం వహించడమంటే రాజకీయాల్లో లాగ స్వార్ధలాభాన్ని చూచుకోవడం కాదు. మరి క్రైస్తవ సమాజాన్ని వృద్ధిలోకి తీసికొనిరావడం. ఈ శక్తి ప్రస్తుతం మన గృహస్థల్లో ఎందరికుంది? కనుకనే వీళ్లకు తర్ఫీదు అవసరమని చెప్పాం. గృహస్తులకు తర్ఫీదు నిప్పించవలసింది మన గురువులూ బిషప్పలూ, తర్ఫీదు ద్వారా ప్రజల బదులు మార్చడం చాలా కష్టమైన కార్యం. కనుక ఈ కార్యక్రమాన్ని మనం వెంటనే ప్రారంభించాలి.

భౌతిక రంగంలో గృహస్థలు నాయకత్వం వహించాలని చెప్పాం. ఈ రంగంలో గురువులు గృహస్థలకు తోడి పనివాళ్లవుతారు. వాళ్లు నాయకులు కారు. తోడిపని వాళ్లుగానే గురువులు కూడ విద్య సాంఘిక సేవ మొదలైన సేవా రంగాల్లో పనిచేయవచ్చు.

7. మఠ సభలకు చెందిన గురువుల, సహోదరులు, కన్యలు కూడ వున్నారు, ఆత్మ మఠసభ స్థాపకులకు ప్రత్యేక సేవావరాలనిస్తుంది. ఈ వరాల ప్రకారం ఈ సభల సభ్యులు క్రైస్తవ సమాజాలకు విద్యావైద్య సాంఘిక సేవాది ప్రత్యేక పరిచర్యలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక పరిచర్యలకు అనుగుణంగానే వీళ్లు తిరుసభలో ప్రత్యేక నాయకత్వం గూడ వహిస్తారు. ఈ నాయకత్వం వీళ్ల సేవలను ಬಳ್ಳಿ వీళ్ల ప్రత్యేక వరాలను బిట్టి వస్తుంది.
8. ఈ దేశంలో మనం అధిక సంఖ్యాకులైన హిందువుల మధ్య జీవిస్తుంటాం. మన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, సాంఘిక సేవా సంస్థలు మొదలైనవాటిల్లో అన్యమతస్థలు కూడ మనతో కలసి పనిచేస్తుంటారు. ఈలా పని చేసేప్పడు మనతోపాటు వీళుకూడ దైవరాజ్యవ్యాప్తికి తోడ్పడుతున్నారని చెప్పాలి. కనుక వీళ్ల మనకు తోడిపనివాళ్లు అందుచేత మనం వీళ్లను కేవలం జీతం తీసికొని పనిచేసిపెట్టేవాళ్ళనుగా మాత్రమే భావించకూడదు, వీళ్లనూ వీళ్ళపనినీ విలువలతో చూడాలి. 

9. గృహసులు - క్రైస్తవులైన క్రైస్తవేతరులైనా - గురువులతోనో లేక మఠకన్యలతోనో కలసి ఏదో విద్యారంగంలో పనిచేస్తున్నారనుకొందాం. అప్పడు వాళ్లు గృహస్థలుగా మాత్రమే పనిచేస్తారు. అనగా గురువులకూ మఠకన్యలకూ వుండే వరాలూ లక్ష్యాలూ గృహస్థలకు వుండవ గృహస్థలు భిన్నమైన ఉద్దేశాలతోను లక్ష్యాలతోను సంస్థల్లో పనిచేస్తారు. ఎందుకంటే వీళ్లు భౌతికరంగంలో పనిచేస్తూ సంసారజీవితం జీవించేవాళ్ళ కనుక