పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. క్రైస్తవ ప్రజల సేవావరాలు

ఆత్మక్రైస్తవ ప్రజలకు ఎన్నోవరాలిస్తుంది. వ్యాధులు నయంచేయడం, ప్రవచనం చెప్పడం, బోధచేయడం, దేవుణ్ణి స్తుతించడం మొదలైనవి ఈ వరాలు - 1కొ 12, 8-10. ఈ వరాలన్నిటికీ ఆధారం ఆత్మే ఆ యాత్మడు తన యిష్టప్రకారం ఒక్కొక్కనికి ఒక్కొక్కవరం ఇస్తుంటాడు - 12,11. ఈ వరాలు మన వ్యక్తిగత లాభానికి గాదు, తోడి ప్రజలకు సేవలు చేయడానికి, అందరికి మేలుచేయడానికి ఒక్కొక్కనికి ఆత్మవరాలు లభిస్తాయి. -12,7. ఈ వరాలతో క్రైస్తవ ప్రజలు క్రీస్తు శరీరమనే సంఘాన్ని అభివృద్ధిలోకి తేవాలి —ఎఫే 4,12. ప్రతివాడు దేవుని నుండి తాను పొందిన సేవావరాలను ఇతరుల మేలుకై వినియోగించాలి - 1 పేత్రు 4,10.
   ఇతరులకు మనకంటె భిన్నమైన వరాలుండవచ్చు. ఐనా వాళ్ళతో మనం పోటీపడకూడదు. వాళ్ళతో సహకరించి పనిచేయాలి. దేహంలో ఒక అవయవం మరొక అవయవంతో సహకరిస్తుంది. అలాగే క్రైస్తవులు కూడ కార్యరంగంలో ఒకరితో ఒకరు సహకరించాలి = 1కొ 12,12. ఇతరుల వరాలనూ శక్తిసామర్థ్యాలనూ జూచి మనమేసాడు అసూయపడకూడదు. అలాగే మన వరాలను జూచి ఇతరులూ అసూయపడకూడదు. అందరమూ కలసి క్రైస్తవ సమాజాన్ని వృద్ధిలోకి తీసికొని వస్తున్నామా అన్నదే ముఖ్య ప్రశ్న దేవుడు మనకీయని వరాలను ఇతరులకిచ్చి ఇతరులకీయునివి మనకిస్తున్నాడు అంటే, వీటిద్వారా క్రైస్తవులు ఒకరినొకరు పరిపూర్డులను చేసికోవాలని భావం.
    ఈ వరాలతో మనం తోడివారికి సేవలు చేయాలి. అందుచేత ఎవరు కూడ దేవుడు తమకిచ్చిన వరాలను అణచివేసికోగూడదు. ప్రభువు ఇతరులకు దయచేసిన వరాలను అసలే అణచివేయకూడదు. ఒక్కోసారి అజ్ఞానం వల్ల పై స్థానంలో వున్నవాళ్ళు క్రిందిస్థానంలో వున్నవాళ్ళ వరాలను అణగదొక్కుతుంటారు. గురువులు గృహస్థల వరాలను అణచివేయడం, వాటిని వినియోగించుకోకుండా వుండడం అరుదేమి కాదు. ఇది వట్టి యవివేకం. దీన్నే పౌలు అంతరంగంలోని దీపాన్ని ఆర్చివేయడంగా పేర్కొన్నాడు - 1తెస్స 5,19. అనగా పవిత్రాత్మనే అణచి వేయడమన్నమాట. గురువులూ మఠకన్యలూ అన్ని సేవాకార్యాలూ తామే చేయలేరు. అందుచేత సామర్థ్యం గల గృహస్తులను ప్రోత్సహించి వాళ్ళచేత ఆయా సేవలు చేయించుకోవాలి. గృహస్థల సామర్థ్యాలను ఆత్మ వాళ్ళకు దయచేసిన వరాలుగా  భావించాలి.        
     ఇక అందరి మేలు కొరకై ఆత్మ ఒక్కొక్కరికి తన వరాలను అనుగ్రహిస్తుందని చెప్పాం. కనుక ప్రతి క్రైస్తవుడు తన వరాలేమిటివో, అనగా తన ప్రత్యేక శక్తి