పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంసారాలనూ కూలద్రోస్తుంటారు. నాలుక చేసే ఈ దుష్కార్యాలన్నీ ప్రాకృతిక జీవితంలో కాని ఆధ్యాత్మిక జీవితంలో నాలుక చేసే పాడుపనులు ఇంకా ఫరోరంగా వుంటాయి. చీటికిమాటికి నోరుజేసికొని ఇతరులను దుర్భాషలాడి సోదరప్రేమను భగ్నం చేస్తుంటాం.

ఇతరులమీద చాడీలు చెప్పి అపదూరులు మోపి వదంతులు పుట్టించి పాపం మూటగట్టుకుంటూంటాం. కామసల్లాపాలకు దిగి మోహేచ్ఛలను రెచ్చగొట్టి ఇతరులను బురద త్రోక్కిస్తాం. ఈలా నాలుకతో చేయగూడని పనులన్నీ చేస్తూంటాం.

ఇతర అవయావాలతో చేసే పాపాలకంటె నాలుకతో చేసే పాపాలలో కొన్ని విశిష్ట లక్షణాలు గోచరిస్తాయి. (1) ఒక గంటలోనే నాలుకతో ఎన్ని పాపపు మాటలైనా మాటలాడవచ్చు. ఇంత స్వల్పకాలంలో మరో అవయవంతో ఇన్ని పాపాలు చేయలేం. (2)పైగా మనం నాలుకతో పలికే పలుకులు ఆక్షణంలో ఎవరికి ఎంత బాధ కలిగించాయో ఊహించనైనా ఊహించలేం. మన పలుకులు ఇతరుల మనసు నొప్పించాయని కొన్ని రోజులు లేక వారాలు గడచిన తరువాతగాని గ్రహించలేం. మనం పలికే మాటల మాలిన్యం మనకే తెలియకుండా వుంటుంది. (3) ఒకోమారు నాలుక జారినాక ఇకేమీ చేయలేం. మన నోటివెంట వెలువడరాని మాట వెలువడింది. ఎదుటి మనిషి మనసు చివుక్కుమంది. ఇంకేమి చేయగలం? ఎంత ప్రయత్నం చేసినా అతని బాధను తొలగించలేం గదా! ఈ గుణాలను బట్టి నాలుక పదునైన కత్తి లాంటిదని తెలిసికోవాలి. దాన్ని ఏమాత్రం అజాగ్రత్తగా వాడామో, యితరుల హృదయాన్నితెగనరికి తీరుతుంది. విశేషంగా సోదరప్రేమను హతం జేసే మారణ సాధనాల్లో తాను మొదటిదై కూర్చుంటుంది.

4. నాలుకను అదుపులో పెట్టుకోవడం ఎలా?

నాలుకతో తరచుగా సోదర ప్రేమకు వ్యతిరేకంగా పాపంచేస్తుంటాం అన్నాం. కనుక ఈనాలుకను ఎలాగైనా అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేయాలి. "మనుష్యులు వ్యర్థంగా పలికే ప్రతిమాటికీ న్యాయనిర్ణయ దినాన లెక్క చెప్పాలి" అన్నాడు ప్రభువు - మత్తయి 12, 86. మనం ఎన్నిసారులు వ్యర్థంగా మాటలాడి ఎంత పాపం మూటగట్టుకున్నామో!

నాలుకను అదుపులో పెట్టుకోవడం చాల కష్టం. యాకోబు జాబు 3, 8-12 వాక్యాలు నాలుకను గూర్చే బైబుల్లోని అతి ప్రశస్తవాక్యాల్లో ఇవీ కొన్ని కనుక పాఠకులు ఈ వాక్యాలను శ్రద్ధతో చదివి భక్తితో మననం చేసికోవాలి. నరులు గుర్రాల నోటిలో కళ్ళెంబెట్టి వాటిని వశం జేసికుంటారు. పెద్దపెద్ద ఓడలను కీలుతో అటూ యిటూ త్రిప్పతూంటారు. ఈలా మృగ పక్షి సర్ప మత్యాది సమస్తజంతుజాతులన్నీ నరునికి స్వాధీనమయ్యాయి. కాని నాలుక మాత్రం ఎవరికీ స్వాధీనం కాదు. అది రవ్వలాగ చిన్న అవయం గాని, పెద్ద చిచ్చు. నాలుక మన దేహంలో వుండి, ఆ దేహాన్నంతటినీ తగలబెడుతుంది. అది నరకపు చిచ్చువలననే రగులుకొంటుంది. నాలుక మరణాంతక