పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. మాటల్లో సోదర ప్రేమ

మాటల్లో సోదరప్రేమను పాటించడమనేది విశేషంగా మన నాలుకమీద ఆధారపడి వుంటుంది. కనుక సోదరప్రేమనుగూర్చి మాటలాడేటప్పుడు ఈ నాలుకను කීර්ඩ්ෆිජ්o. జ్ఞానస్నానం ఇచ్చేప్పడు గురువు శిశువు నాలుకమీద ఉప్పనుబెట్టి "ఈ జ్ఞానపుఉప్పను పొందు" అంటాడు. ఇక్కడ ఉప్ప దేవుని జ్ఞానమైన క్రీస్తును సూచిస్తుంది. ఇక మీదట ఈ నాలుకనుండి జ్ఞానంతో గూడిన పలుకులేగాని తెలివిలేని మాటలు వెలువడగూడదని ఈ క్రియ భావం. కాని శిశువు పెరిగి పెద్దవాడైన కొలది ఆ నాలుకనుండి ఏబ్రాసి పలుకులుగూడ వెలువడతాయి!

1. నాలుక మన హృదయాన్ని సూచిస్తుంది

జంతువులో కొన్నిటికి నరులకంటె శ్రవణశక్తి అధికంగా వుంటుంది. కొన్నిటికి స్పర్శశక్తి అధికంగా వుంటుంది. కొన్నిటికి నేత్రశక్తి అధికంగావుంటుంది, కాని మాటాడే శక్తి ఏ జంతువుకీలేదు. నరుడొక్కడే మాటలాడేవాడు. జంతువులలో లేని బుద్ధిశక్తి నరుల్లో వుంది. ఈ బుద్ధిశక్తిని అతడు తన నాలుకద్వారా వ్యక్తం చేస్తూంటాడు. నాలుకద్వారా తన లోని భావాలను ఇతరులకు తెలియజేస్తూంటాడు. ఇతరులలో కూడ తన భావాలలాంటి భావాలను రేకెత్తిస్తూంటాడు. గురువు శిష్యునికి పాఠం చెప్పడం ఈలాంటదే. ఇది ఓ సృజన శక్తి ఈ శక్తికి సాధనం నాలుకే.

కొందరు చాల కలుపుగోలు తనంతో స్నేహభావంతో మాటలాడుతూంటారు. హృదయంలోని ప్రేమభావాన్ని వాళ్ళ నాలుక మాటలద్వారా వ్యక్తం చేస్తుంది. ఈలాగే ఇతర మానసిక భావాలు కూడ. హృదయంలో నిండివుండే భావాలనుబట్టి నోరు మాటలాడుతుంది - మత్త 12,34 కనుక నాలుక మనహృదయాన్ని సూచిస్తుంది. మన మేలాంటి వ్యక్తులమో తెలియజేస్తుంది. భక్తుడు ఫ్రాన్సిస్ డిసేల్సు ఓ చక్కని ఉపమానం చెప్పాడు. వైద్యుడు రోగి నాలుకను జూచి అతని ఆరోగ్యస్థితిని తెలిసికుంటాడు. అలాగే మనమూ ఓ వ్యక్తి మాటలాడే తీరును జూచి అతని ఆత్మస్థితిని తెలిసికోవచ్చు. అతడేలాంటివాడో గ్రహించవచ్చు

2. నాలుక మంచి పనికి ఉపకరిస్తుంది.

నాలుకతో బోలెడన్ని మంచిపనులు చేస్తుంటాం. ఎవరినోటినుండో ఒక ప్రేమ గల మంచి మాట వినివుంటాం. ఆ మాటను జీవితాంతం వరకూ మరచిపోలేం. మనం బాధల్లో వున్నపుడు ఎవరో ఓ దయగల పలుకు పలికారు. ఆ వ్యక్తినీ, అతని పలుకునీ పూజ్యభావంతో స్మరించుకుంటూంటాం.

నాలుక చేసే ఈ మేళ్లన్నీ ప్రాకృతిక జీవితంలో ఇక ఆధ్యాత్మిక జీవితంలో నాలుక ఎన్నో ఉపకారాలు చేస్తుంది. నాలుక ద్వారా బోధకుడు క్రీస్తును బోధించినప్పడేగాని