పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేమతో జూడవలసిన తోడిమానవుని ద్వేషభావంతో చూస్తూంటాం. కనుక క్రైస్తవ సాధకుడు ఈ యంశాన్ని గూర్చి చక్కగా ఆత్మశోధనం చేసికొంటూండాలి.

అసూయవలన జనించే మరో దురుణం ఇతరులనుగూర్చి చెడ్డగా మాటలాడుతూండడం. ప్రతినరుడూ పేరుప్రతిష్టలతో జీవించాలనే కోరుకుంటూంటాడు. తాను మంచివాడుగా, సమరుడుగా పరిగణింపబడాలనే అభిలషిసూంటాడు. మనం అతన్నిగూర్చి చెడ్డగా మాట్లాడి అతని పరువు కాస్త తీసివేస్తాం. ఇది నరహత్య కాదుగాని, నరని కీర్తిహత్య కనుక సోదరప్రేమనుగూర్చి విచారించేపుడు ఈ యంశాన్నిగూడా జాగ్రత్తగా గమనించాలి, మోషే అన్నా అక్కాఅయిన అహరోనూ మిర్యామూ మోషేనుగూర్చి అసూయపడ్డాడు, ప్రభువు మోషేద్వారా మాత్రమే మాటలాడాడా, మాతో మాత్రం మాటలాడలేదా అని అతన్ని కించపరిచారు. అందుకే ప్రభువు మిర్యామును శిక్షించి ఆమెకు కుష్టరోగం గలిగించాడు - సంఖ్యా 12,10.

అసూయకు గురైన నరుడు ఇతరుల కలిమిని జూచి నొచ్చుకుంటాడు. దీనివలన వ్యాధిలేకుండానే బాధపడతాడు. తెలుగుకవి తిక్కన

ఒరుల థనమునకు విద్యా
పరిణతికిం దేజమునకు బలయునకు మనం
బెరియగ నసవ్యాపడు న
న్నరుడు తెవులులేని వేదనంబడు నథిపా!

అని చెప్పాడు. ఈ "తెవులు లేని వేదన' ఎలా వుంటుందో మన కందరకూ అనుభవపూర్వకంగా తెలుసు!

గ్రీకు తాత్వికుడు అరిస్టోటలు అసూయను గూర్చి చెపూ "దేశ కాల ప్రాయ వృత్తి ప్రసిద్ధి బంధుత్వాల్లో మనకు దగ్గరివాళ్ళెవరో వాళ్ళను జూచి అసూయ పడుతూంటాం" అని వ్రాసాడు. మన దేశంలోను, మన కాలంలోను ఉన్నవాళ్ళను గూర్చి అసూయపడతాం. మనకంటె పెద్ద ప్రాయంలోను చిన్న ప్రాయంలోను వున్న వాళ్ళను జూచి అంతగా అసూయపడం. మన వృత్తి కంటె భిన్నమైన వృత్తిలో వున్న వాళ్ళను జూచి అసూయడం. బిచ్చగాడు ధనికునిజూచిగాదు, ಒಂಟ್ బిచ్చగానిని జూచి అసూయపడతాడు. మనం చేసేపనినే చేస్తూన్నా ప్రసిద్ధిలోనికి రానివాళ్ళను జూచి అసూయపడం. మన కుటుంబానికి చెందిన వాళ్లను జూచి మొట్టమొదట అసూయపడతాం. అందుకే అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ ఒకరిని జూచి ఒకరు అంతగా అసూయపడేది. అరిస్టోటలు చెప్పిన ఈ యారు అసూయూకారణాలు జ్ఞాపకముంచుకోవడం మంచిది.