పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సన్నిధిలో నడచే భాగ్యం ప్రసాదించు" అని మనవి చేసికోవాలి. ఈలా ఉదయాన్నే ప్రారంభించిన సాన్నిధ్యపుటభ్యాసాన్ని సాధ్యమైనంత వరకు దినమంతా కొనసాగించుకోవాలి.

6. దైవసాన్నిధ్యాన్ని గురుకి తెచ్చుకోకుండా మన ప్రార్థనను ఎప్పుడూ ప్రారంభించగూడదు. ప్రార్థనకు ముందు మనం దేవుని సన్నిధిలో వున్నామనుకోవాలి. ఆ ప్రభువుకి వినయవిధేయతలతో నమస్కరించాలి. యాకోబులాగే "ఈ ప్రదేశం ఎంత భయంకరమైంది! ఈ తావు దైవనిలయం. ఇది స్వర్గద్వారం" అనుకోవాలి - ఆది 28,17. అబ్రాహాములాగే "దుమ్మూ బూడిదా ఐన నేను దేవరవారితో మాట్లాడ్డానికి సాహసిస్తున్నాను" అని చెప్పాలి - ఆది 18,27. బాలుడైన సమూవేలులాగే "ప్రభూ! నీ దాసుడు ఆలించడానికి సిద్ధంగానే వున్నాడు. సెలవీయి" అనాలి - 1 సమూ 3,10. సుంకరిలాగే "దేవా! పాపినైన నన్ను కరుణించు" అని అడుగుకోవాలి - లూకా 18,13. ఈలా దైవసాన్నిధ్యాన్ని గుర్తుకి తెచ్చుకొని ప్రార్థనను ప్రారంభించేవాళ్ళు పరాకులకు గురికాకుండా భక్తితో ప్రార్ధిస్తారు.

జాన్ క్లిమాకస్ అను పునీతుడు ఈలా వ్రాసాడు, "మా మఠంలో సన్యాసులంతా ఉమ్మడి ప్రార్థనలు చెప్పకొనేపుడు నేను ఒక సన్యాసి అధిక భక్తితో ప్రార్ధించడం గమనించాను. అతడు తన్మయంతో ఎవరో అదృశ్య వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా కన్పించాడు. నేనతన్ని నీకీలాంటి భక్తి ఏలా ఆలవడిందో చెప్పమని అడగ్గా అతడు నాతో "నా పద్ధతి యిది. ప్రార్థనను ప్రారంభించేపుడెల్లా నేను నా హృదయాన్నీ మనస్సునీ ఆలోచనలనూ హెచ్చరిస్తాను.

రండి మన దేవునికి నమస్కారంచేసి
అతని ముందు చాగిలపడదాం
మనలను సృజించిన ప్రభువు సన్నిధిని మోకరిల్లదాం
అతడే మన దేవుడు
మనం అతడు పాలించే ప్రజలం
అతడు మేపే గొర్రెలం 

అని వాటితో జెప్తాను - కీర్త 95, 6-7. దీనివల్ల నాకు ఎంతో భక్తి పడుతుంది అని చెప్పాడు". కనుక మనం కూడ ఈ పుణ్యాత్మునిలాగే దైవసాన్నిధ్యాన్ని గుర్తుకి తెచ్చుకొనిగాని ప్రార్ధనం చేయకూడదు.

ఇంకా క్రిసోస్తం భక్తుడు ఈలా పలికాడు. "మనం ప్రార్ధనం చేసికొనేపుడు మోక్షంలో సింహాసనంమీద వైభవంగా ఆసీనుడైయున్న ప్రభువు ముందట