పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలి దేవుని కర్పించే కానుక, కాని క్రీస్తు దేవునికి ఏమర్పించాడు? తన నెత్తురునా? దాన్ని మాత్రమే కాదు. ఆ నెత్తురు సూచించే ప్రేమ విధేయతలనా? అంత మాత్రమేకాదు. క్రీస్తు తన్ను తానే పితకు అర్పించుకున్నాడు. ఇక, క్రీస్తు తన్నుతానే పితకు అర్పించుకున్నాడన్నా లేక తాను పితయొద్దకు మరలిపోయాడన్నా ఒకటే. ఎందుకంటే, ఆత్మార్పణంద్వారా అతడు పితను చేరుకున్నాడు గదా! కనుక క్రీస్తు అర్పణం అంటే అతడు పితను చేరుకోవడం, అంతే. ఆ క్రీస్తులాగే మనమూ పితను చేరుకునే భాగ్యంకోసం ప్రార్థిద్దాం.

61. మనకోసం - ఎఫె 5,2.

క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం తన్నుతాను బలిగా అర్పించుకున్నాడు అంటాడు పౌలు. ఇక్కడ మనకోసమంటే మన పాపాల నిమిత్తమని భావం - 1 కొ. 15,3. మన పాపాల నిమిత్తమంటే పాపక్షమాపణం కొరకని అర్థం - మత్త 26,28. మార్కు సువార్తకూడ "మనుష్య కుమారుడు అనేకుల కొరకు క్రయధనంగా తన ప్రాణాలు ఈయడానికి వచ్చాడు" అంటుంది - 10, 45. అనగా బాధామయ సేవకుళ్ళాగే క్రీస్తు అనేకులకోసం, అంటే సమాజంకోసం, సమాజానికి ఉపకారం చేయడంకోసం ప్రాణాలర్పిస్తాడనిభావం. క్రీస్తు చనిపోయింది మనకు బదులుగా గాదు, మనకొరకు. మనస్థానంలోగాదు, మనలను తనలో ఇముడ్చుకొని, మన ప్రతినిధిగా చనిపోయాడు. -తి మొు 2,6. ప్రభు మరణఫలితంగా మనం పూర్తి పాపక్షమాపణం పొందాలని ప్రార్థిద్దాం.


62. నరుడు దేవుణ్ణి చేరుకుంటాడు

పాపం ద్వారా నరుడు నాశమైపోయాడు. భౌతికంగా ఆధ్యాత్మికంగాగూడ చనిపోయి, దైవజీవాన్ని కోల్పోయాడు. పాపం ద్వారా అతడు దేవుని మీద తిరుగుబాటు చేసాడు. దేవునికి దూరమైపోయాడు. ఐనా దేవుడతన్ని మరచిపోలేదు. అతడు మళ్ళా తన చెంతకు తిరిగిరావాలనే ఆ తండ్రి వుబలాటం. ఐనా దేవుడతన్ని బలాత్కారంగా తన చెంతకు లాగుకొనరాదు. అలా చేయడం నరుని స్వాతంత్ర్యాన్ని భంగపరచడమే ఔతుంది, కనుక దేవుడు నరుని స్వాతంత్ర్యానికి దెబ్బ తగులకుండానే అతన్ని రక్షించే మార్గమొకటి కనిపెట్టాడు. నరుడై జన్మించిన దేవునిద్వారా నరుడ్డి నరుడే రక్షించుకోవడమే ఈ మార్గం, ఈ విధానాన్నునుసరించి దేవుడు నరుడై జన్మించాడు. అతడు దేవుడైనా గూడ, అచ్చంగా మనలాగే మానిసి. పాపం ద్వారా మానవుడు దేవునిమీద తిరుగుబాటు చేసాడన్నాం. కాని యీ దైవమానవుడు తన విధేయతద్వారా నరుని తిరుగుబాటుకు ప్రతీకారం చేసాడు. నరుణ్ణి మళ్ళా దేవుని యింటికి చేర్చి దేవునితో రాజీపరచాడు. అతని ద్వారా నరుడు దుడుకు చిన్నవాడిలా తనకోసం కాచుకొనివున్న తండ్రి యింటికి తిరిగివచ్చాడు. ఓ