పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58. ఈసాకు సందర్భాలు

నూత్నవేదం మూడుతావుల్లో ఈసాకు- క్రీస్తు పోలికలను సూచిస్తుంది. (1) హెబ్రేయులపత్రిక 11,17-19 ప్రభువు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాడని చెప్తుంది. యావే ప్రభువు ఈసాకుని మళ్ళా బ్రతికిస్తాడనీ, అతని ద్వారా తన సంతానాన్ని కొనసాగిస్తాడనీ అబ్రాహామునమ్మాడు. నమ్మి కుమారుని సమర్పించాడు. అతడు నమ్మినట్లే ప్రభువు ఈసాకును బ్రతికించాడు. ఇక్కడ ఈసాకు మళ్ళా బ్రతకడం, క్రీస్తు చనిపోయి మళ్ళా బ్రతకడాన్ని సూచిస్తుంది. (2) హెబ్రే 11,17. ఈసాకు అబ్రాహామునకు ఏకైక కుమారుడు లేక ప్రియకుమారుడు అంటుంది. ఆదికాండ 22,2 కూడ ఈలాగే పిలుస్తుంది. క్రీస్తుకూడ పరలోకపితకు ఏకైక కుమారుడు లేక ప్రియకుమారుడు - మార్కు 1,11. ఇక్కడ ఈసాకునకు వాడబడిన పదమే క్రీస్తునకు గూడ వాడబడ్డంచేత అతడు ఇతన్ని సూచిస్తుంటాడు. (3) రోమీయులు 8,32. దేవుడు తనసొంత కుమారుని మనకొరకు అప్పగించాడు అంటుంది. ఈ తండ్రి సొంతకుమారుని అప్పగించినట్లుగానే పూర్వం అబ్రాహాము గూడ సొంతకొడుకుని అప్పగించాడు. కనుక ఇక్కడగూడ ఈసాకు సందర్భం సూచింపబడింది. పితకు ప్రియకుమారుడైన ఈ క్రీస్తును విశ్వసించి తరిద్దాం.

54. ఈసాకు బలి

బలిగా సమర్పింపబడిన వ్యక్తి దేవునిదగ్గరకు వెళ్తాడు. దేవునికి అర్పింపబడతాడు. కనుకనే యోహాను 13,1"యేసు ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యెరిగి" అంటుంది. ఈసాకూ ఈలాగే బలిరూపంలో దేవుణ్ణి చేరుకునేవాడే అతడు బలిజంతువేదీ అని తండ్రిని అడిగాడు. అందుకు అబ్రాహాము "దేవుడే సమకూరుస్తాడు. నేను నిన్నుదేవునికి సమర్పించబోతున్నాను. నాకంటే ముందుగా నిన్ను దేవునియొద్దకు బలిగా పంపిస్తాను. ఈ ప్రార్థనలతో, ఈ పవిత్రమైన కర్మకాండతో దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. నీ యాత్మను తన యెదుట నిలుపుకుంటాడు అని చెప్పాడు. ఈసాకు తండ్రి మాటలకు సరేనని చనిపోవడానికి తయారై బలిపీఠం దగ్గరకు వచ్చాడు. అప్పడు దేవదూత అడ్డుపడబట్టి ఈసాకు మరణం తప్పిపోయింది" - ఇది యోసీఫసు అనే యూదచరిత్రకారుడు వ్రాసిన అంశం. ఈ వ్రాతనుబట్టికూడ ఈసాకు క్రీస్తును సూచిస్తూంటాడని వ్యక్తమౌతుంది.

55. తండ్రి అనురాగం, కుమారుని విధేయత

పై ఈసాకు వృత్తాంతం ప్రజలు క్రీస్తుబలిని చక్కగా అర్థం చేసుకునేలా సాయపడింది. అబ్రాహాము లాగా తండ్రి అనురాగంతో కుమారుని సమర్పించాడు. ఈసాకులాగా క్రీస్తు విధేయతతో తండ్రి ఆజ్ఞను పాటించాడు. కొందరు భావించినట్లు దేవుని కోపాన్ని పోగొట్టడానికిగాదు క్రీస్తు బలిఅయింది. అతడు మనకు బదులుగా