పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాధలద్వారా భావిలోని క్రీస్తును సూచించారు. వీళ్ళకే సూచకవ్యక్తులని పేరు. బాధామయ సేవకుడు, మొదలైనవాళ్ళు ఈ సూచకవ్యక్తులు.

మొదట బాధామయ సేవకుణ్ణి గూర్చి విచారిద్దాం. యెషయాప్రవక్త 53వ అధ్యాయమంతటా ఈ సేవకుణ్ణి వర్ణించుకుంటూ బోయాడు. మన దోషాలవలన అతన్ని నలుగగొట్టారు. మన శిక్ష అతనిమీద పడింది. అతని దెబ్బల వలన మనకు స్వస్థత చేకూరింది. అన్యాయపు తీర్పునకులోనుజేసి అతన్ని కొనిపోయారు. ప్రజల అతిక్రమాల వలన అతన్ని మోదారు. సజీవుల భూమిమీద నుండి చంపివేసారు. అతడు తన ప్రాణాలను ధారవోసాడు. అనేకుల పాపాలను భరించి తిరుగుబాటు చేసినవాళ్ళకోసం విజ్ఞాపనం చేసాడు- 53, 5.6.8.12. ఈ సేవకుని బాధలద్వారా భావిలో బాధ అనుభవించబోయే క్రీస్తును కన్నులకు గట్టినట్లుగా చిత్రించాడు ప్రవక్త

కాని యీ బాధామయ సేవకుడు ఎవరు? ఇతడు ఓ సాముదాయక వ్యక్తి. యావే సేవకుల నందరినీ తనలో ఇముడ్చుకొనిన మహా సేవకుడు. తాను ఎవరి పాపాలను భరించాడో వాళ్ళను తనతో ఐక్యం జేసికొనిన మహానుభావుడు. క్రీస్తుకు ప్రతిరూపమైన వ్యక్తి క్రీస్తు దెబ్బల వలన మనకు స్వస్థత చేకూరిందనే సత్యాన్ని స్మరించుకొని ప్రార్ధనం చేసుకుందాం.

49. క్రీస్తు పోలికలు

యెషయా 58, 9–11 లో సేవకుణ్ణి ఈలా వర్ణించాడు :

1. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు. 2. అతడు తన్ను పాపపరిహారబలిగా సమర్పించుకున్నాడు. 3. నీతిమంతుడైన సేవకుడు అనేకులను నిర్దోషులను జేస్తాడు.

పౌలుకూడ అచ్చంగా ఈ వాక్యాలనే మనసులో పెట్టుకొని క్రీస్తును ఈలా వర్ణించాడు - 2కొ 5,21:(1. క్రీస్తు యేపాపమూ యెరుగడు. 2. అతడు మనకోసం పాపపరిహార బలి అయ్యాడు, 3. అతని ద్వారా మనం దేవుని నీతిని (రక్షణాన్ని) పొందుతాం.

ఈ వాక్యాలనుబట్టి పౌలు బాధామయ సేవకఘట్టాన్ని యెంత మక్కువతో మననంజేసికున్నాడో వ్యక్తమౌతుంది. క్రీస్తు ఆర్థించిన నీతి ద్వారా మనం కూడా నిర్దోషులమూ నీతిమంతులమూ గావాలని అడుగుకుందాం.

50. అనేకుల కొరకు - మార్కు 14, 24

దివ్యభోజన వాక్యాల్లో ప్రభువు "ఇది అనేకులకొరకు చిందబడనున్ననా రక్తం" అంటాడు. మరో తావులోగూడ "మనుష్యకుమారుడు అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఈయడానికి వచ్చాడు" అని చెప్పబడింది - మార్కు 10,45. పై బాధామయ సేవకుడు గూడ అనేకులను నిర్దోషులను చేస్తాడనీ అనేకుల పాపాలను భరిస్తాడని చెప్పబడింది - యెష58, 11-12. కనుక నూత్నవేదరచయితలు ఈ "అనేకులు" అనే శబ్దాన్నియెషయా