పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యావే చేసిన నిబంధనపనెత్తురు ద్వారా యిప్రాయేలు ప్రజలు చెరనుండి విడిపింపబడతారు అని చెప్పంది. ఆలాగే క్రీస్తు నెలకొల్పిన నూత్ననిబంధనరక్తం వలన మనమూ పాపపు చెరనుండి విడిపింపబడతాం, ఆ ప్రభువు ప్రజలమౌతాం. ప్రభువు మనలనూ కాపరి చూచే చూపున చూస్తూఉండాలని ప్రార్థిద్దాం.

40. క్రీస్తు రక్తం మేలైంది - హెబ్రే 9, 12-14

హెబ్రేయపత్రికాకారుడు 9, 19-20లో నిర్గమ కాండలోని నిబంధనరకాన్ని గూర్చిన వాక్యాలను ఉదాహరించాడు. కాని జంతురక్తాన్ని పీఠంమీద చిలకరించారు అనడానికి మారుగ నిబంధనపుస్తకంమీద చిలకరించారు అని చెప్పాడు. పీఠంలాగే ఈ పుస్తకంగూడ దేవుణ్ణి సూచిస్తుంది. ఇక మేకల నెత్తురు, ఎడ్ల నెత్తురు ప్రజల పాపాలు పరిహరిస్తే క్రీస్తురక్తం మనలను ఎంతగా శుద్ధిచేస్తుందో ఊహింప మన్నాడు – 9, 1214, 1 పేత్రు 1,18లో గూడ వెండిబంగారాలు జంతువుల నెత్తురులు మొదలైన విలువలేని వస్తువులచేతగాదు, మరి అమ్యూలము నిర్దోషము నిష్కళంకమునైన గొర్రెపిల్ల రక్తంచేత క్రైస్తవులు విమోచింపబడ్డారని చెప్పబడింది. ఈలాంటి వాక్యాలన్నిటిలో క్రీస్తురక్తం సీనాయి నెత్తురుకంటె మేలైందని భావం. ఈలాంటి రకాన్ని చిందించడానికి క్రీస్తు ఎంతగా శ్రమపడ్డాడో ఊహించమనీ భావం.

41. రెండు రకాల ప్రాయశ్చిత్తబలులు

పై యంశాల్లో పాస్క గొర్రెపిల్ల రక్తాన్ని గూర్చి నిబంధనరక్తాన్ని గూర్చీ విచారించాం. ఇక ప్రాయశ్చిత్తబలులకు సంబంధించిన రక్తాన్నిగూర్చి ఆలోచించాలి. ఈ ప్రాయశ్చిత్తబలులు రెండు రకాలు. మొదటిది, కిప్పూరు రోజున సమర్పించే బలి. ఈ బలిలో కోడెదూడ నెత్తురును కరుణాపీఠంమీద ఓమారు, దానిముందు ఏడుసార్లు చిలకరించేవాళ్ళు. ఆలాగే మేకనెత్తురు గూడ తీసికొని కరుణాపీఠంమీద ఓమారు, దానిముందు ఏడుసార్లు చిలకరించేవాళ్ళ - లేవీ 16, 14-16, ఈ బలిని ఏడాది కొకసారి ప్రధానయాజకుడు మాత్రమే సమర్పించేవాడు. ఇక రెండవది, పాపపరిహారబలి. ఈ బలిలో మందసమందలి తెరవద్ద నిలుచుండి కోడెనెత్తురును ఏడుసారులు మందసం వైపు చల్లారు. మందసంమీదగల కరుణాపీఠంపై వసించియున్న ప్రభువు ఆలా చల్లబడిన నెత్తురును జూచి ప్రజల పాపాలు పరిహరిస్తాడు, ప్రభువు మన పాపాలను గూడ క్షమిస్తూండాలని ప్రార్థిద్దాం.

42. దేనినుండి ప్రాయశ్చిత్తం?

ప్రజల పాపం పవిత్రస్థలాన్ని అపవిత్రం జేస్తుంది. కనుక ప్రభుసాన్నిధ్యం ఆ స్థలాన్ని విడచి వెళ్ళిపోతుంది - యెహె. 10,18. ప్రాయశ్చిత్త కర్మద్వారా ప్రజల పాపాలు పరిహారమౌతాయి. వాళ్ళ పరిశుద్ధస్థలమూ పవిత్రమౌతుంది. దైవసాన్నిధ్యం మళ్లా ఆ