పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దూడను ఆరాధించి చెడిపోయిన ప్రజలకోసం ప్రాయశ్చిత్తం చేయడానికి కొండమీదికెక్కిపోతాడు. ఈ ప్రాయశ్చిత్తం ప్రజల తరఫున అతడు చేసిన ప్రార్ధనమేగాని నెత్తురు చిలకరించడం గాదు. సంఖ్యాకాండ 16,47లో అహరోను గుడారంలో ప్రవేశించి ధూపంవేసి ప్రజలకోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఈ ప్రాయశ్చిత్తంగూడ విజ్ఞాపన ప్రార్ధనమేగాని నెత్తురు చిలకరించడంగాదు. అందుకే తరువాత వచ్చిన జ్ఞానగ్రంథకర్త ఈ వాక్యాన్ని స్మరించుకుంటూ "అహరోను ధూపం ప్రార్ధన అనే సేవాసాధనాలనువాడి ప్రజలకోసం ప్రాయశ్చిత్తం చేసాడు" అని నుడివాడు - జ్ఞాన 19,21 ప్రాయశ్చిత్తానికి విజ్ఞాపన ప్రార్ధనమనే అర్ధాన్నిచ్చే పట్టులు ఈలాంటివే మరికొన్ని ఉన్నాయి. ప్రభువు మన తప్పిదాలను క్షమించాలని ప్రార్దిద్దాం. వేరేవాళ్ళ తప్పిదాలను గూడ క్షమించాలని విజ్ఞాపనం చేద్దాం.

27. క్రీస్తు కరుణాపీఠం - రోమా 3,25.

}}

పూర్వవేదంలో కరుణా పీఠం అంటే ఏమిటో చూచాం. నూత్న వేద రచయితలు క్రీస్తు మన కరుణా పీఠం అన్నారు. పౌలు రోమీయుల జాబు 3,25లో పిత క్రీస్తును కరుణా ఫలకంగా జేసి ప్రజలకు చూపించాడని వ్రాసాడు. పూర్వవేదంలోని కరుణాపీఠంపై నెత్తురు చిలకరించడం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందన్నాం. ఇక నూత్నవేదంలో మన కరుణా ఫలకం క్రీస్తు, సిలువమీద వ్రేలాడుతూ నెత్తురులతో తడిసిన క్రీస్తుదేహం, రక్తసిక్తమైన ఆ కరుణాపీఠం లాంటిది. ఆ కరుణా పీఠంమీదలాగే ఈ సిలువమీద వ్రేలాడే క్రీస్తునందుగూడ యావే ప్రభువు నెలకొని వున్నాడు. కనుకనే అతడు క్రీస్తుద్వారా ప్రపంచాన్ని తనతో సమాధానపరచుకోగల్గాడు- 2 కొ 5,19.

అయినా యిక్కడ కరుణాఫలకానికీ, సిలువ మీద వ్రేలాడే క్రీస్తు ఒడలికీ కొన్ని భేదాలు గుర్తించాలి. కరుణాఫలకంమీద జంతువుల నెత్తురు చిలకరించేవాళ్లు. కాని క్రీస్తు తన యొడలి నుండి సొంత నెత్తురే ఒలికించాడు. కరుణాపీఠం గుడారంలో వుండేది. ఎవ్వరికీ కనుపించేది గాదు. ప్రధాన యాజకుడు తప్పితే మరెవ్వరూ దాని చెంతకు వెళ్ళేవాళ్ళగాదు. కాని సిలువపై వ్రేలాడే క్రీస్తును పిత అందరకూ చూపించాడు. దేవాలయపు తెర చినిగిపోవడంతో లోపలి గర్భాగారం అందరకూ కనుపించింది - మత్త27,51. ఈ తెర చినగక ముందు అనగా పూర్వవేదవిధానం చెల్లబడి అయ్యేప్పడు, దైవసాన్నిధ్యంలోనికి అందరూ వెళ్ళేవాళ్ళుగాదు. కాని ఓమారు అది చినిగిపోయాక, అనగా పూర్వవేద విధానం అడుగంటాక నూత్న దైవసాన్నిధ్యమైన క్రీస్తు దగ్గరకు అందరూ వెళ్ళవచ్చు. ఈ ప్రభువు నేడు మనపట్ల గూడ కరుణా ఫలకంలా మెలగుతూండాలని అడుగుకుందాం.

28. ప్రాయశ్చిత్తం చేయడానికై - హెబ్రే 2,17.

}}

- హెబ్రేయ పత్రిక 2,17 క్రీస్తు ప్రజల పాపాలకొరకు ప్రాయశ్చిత్తం చేయడానికై ప్రధాన యాజకుడయ్యాడు అని చెప్తుంది. ఈ ప్రాయశ్చిత్తం క్రీస్తు విజ్ఞాపన ప్రార్ధనమే