పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కప్పివేసేలా చేసేవాడు - లేవీ 16,13. రెండవది, ఆ కరుణాపీఠం మీదనుండి ప్రభువు ప్రజలతో మాటలాడేవాడు - నిర్గ 25,22. మూడవది, ఈ కరుణాపీఠం ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఉపకరించేది. మన పాపాలనూ ప్రభువు పరిహరిసూండాలని అడుగుకుందాం.

25. నెత్తురు చిలకరింప - లేవీ 16,12-16.

}}

కరుణాపీఠం ప్రాయశ్చిత్తానికి ఏలా వుపకరిస్తుంది? యూదులు ఏడాదొకొకసారి ప్రాయశ్చిత్తదినాన్నిజరుపుకునేవాళ్ళు. ఈ దినానికే కిప్పూర్ అనిపేరు. ఈకిప్పూరు రోజున ప్రధాన యాజకుడు కోడెదూడల నెత్తురు తీసికొని గుడారంలోనికి వెళ్ళేవాడు. తెర వెనుకనున్న మందసాన్ని సమీపించి కరుణాపీఠం పైని ఒకమారు, దాని ముందట నేలమీద ఏడుసారులు ఆ నెత్తురు చిలకరించేవాడు. అలాగే మేకనెత్తురు కూడ తీసికొని వెళ్ళి కరుణాపీఠంపై ఓమారు, దానిమందట ఏడుమార్లు చిలకరించేవాడు. యూదుల భావం ప్రకారం ప్రజల పాపాలవల్ల గుడారం అపవిత్రమౌతుంది. ఈలా నెత్తురు చల్లడంవల్ల మలినమైన పవిత్ర స్థలానికి ప్రాయశ్చిత్తం చేసినట్లు ఈ నెత్తురు చిలకరింపువల్ల గుడారం మళ్ళా పవిత్రమౌతుంది. ప్రజల పాపాలూ పరిహారమౌతాయి. ఈ తంతంతా లేవీయకాండ 16, 12-16లో వర్ణింపబడింది.

కిప్పూరుదినాన జరుపబడే ప్రాయశ్చిత్త కర్మ మాత్రమే గాక, సంవత్సరం పొడుగునా యూదులు ప్రజల పాపపరిహారం కోసమై మరికొన్ని ప్రాయశ్చిత్తకర్మలు జరిపేవాళ్లు. వీటికే "పాపపరిహార బలులు" అని పేరు. లేవీయ కాండ 4,1-6 ఈ కర్మకాండను వర్ణిస్తుంది. యాజకుడు కోడెదూడను గుడారపు గుమ్మమవద్దకు తీసికొనివచ్చి దాని మీద చేయి ఉంచుతాడు. ఈ చిహ్నం ద్వారా ప్రజలు ఓ విధంగా ఆ దూడతో ఐక్యమౌతారు. ఆ పిమ్మట దూడను వధించి దాని నెత్తురుతో గుడారంలోనికి ప్రవేశించి తెర యెదుట నిలువబడి ఏడుసార్లు మందసంవైపు ఆ నెత్తురును చిలకరిస్తాడు. యాజకుడు ఈలా నెత్తురును చిలకరింపగా కరుణా ఫలకంమీది ప్రభువు ప్రజల పాపాలను పరిహరిస్తాడు. కనుక ఈ ప్రాయశ్చిత్త బలులన్నిటిలోను నెత్తురు చిలకరింపు ప్రధానం. బైబులు భగవంతుడు పాపాన్ని సహింపనివాడు. ఆ ప్రభువు మన పాపాన్ని గూడ పరిహరించాలని అడుగుకుందాం.

26. ప్రాయశ్చిత్తం - విజ్ఞాపన ప్రార్ధనం -సంఖ్యా 16,47

}}

పూర్వవేదంలో "ప్రాయశ్చిత్తం" చేయడమనగా సాధారణంగా నెత్తురు చిలకరించడమని భావం. అనగా కరుణా ఫలకంపై నెత్తురు చిలకరించి పాపపరిహారం చేయడమని అర్థం. కాని కొన్ని తావుల్లో ప్రాయశ్చిత్తం చేయడమనగా ప్రజల తరపున విజ్ఞాపన ప్రార్ధనం చేయడమని గూడ అర్థం. నిర్గమకాండ 32,30లో మోషే, బంగారు